ములుగు జిల్లాలోని మేడారంలో తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవాలైన సమ్మక్క- సారలమ్మల మినీ జాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 27 వరకు నాలుగు రోజుల పాటు వన దేవతలకు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. జాతరకు 20 లక్షలకుపైగా భక్తులు వస్తారని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి 52 లక్షలను వెచ్చించి సౌకర్యాలు కల్పించింది. గద్దెల ప్రాంగణంలో చలువ పందిళ్లు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. స్నానాలకు జంపన్నవాగులో వాటర్ ట్యాప్‌లను అమర్చారు. మహిళల కోసం దుస్తులు మార్చుకునే గదులు కూడా అందుబాటులోకి తెచ్చారు. తాగునీటి కోసం మిషన్ భగీరథ కింద పది మినీవాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. వరంగల్, హన్మకొండ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు లను నడిపిస్తోంది.
