వ్యాపార‌వేత్త ఇంట్లో 400 కోట్ల‌ గుట్టల గుట్టల డబ్బు లెక్కించలేక ఐటీ అధికారుల అవ‌స్థ‌లు!

0
33
Spread the love

దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఆదాయపన్ను శాఖ అధికారుల దాడులు సహజమే అయితే ముంబయి నగరంలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో జరిపిన సోదాల్లో గుట్టల గుట్టల డబ్బు బయట పడింది. లెక్కచూపని ఈ డబ్బును లెక్కించేందుకు మెషీష్లను తీసురావాల్సి వచ్చింది. వ్యాపారి ఇంట్లో కట్టలపాముల కథేంటో ఇప్పుడు చూద్దాం…

వారం కిందట కోల్ కతాలో ఓ మంత్రి ప్రియురాలి ఇంట్లో అక్రమంగా దాచిన 90 కోట్ల రూపాయలను ఈడీ అధికారులు సీజ్ చేశారు. టీచర్ నియామకాల్లో సదరు మంత్రి అక్రమాలకు పాల్పడి వచ్చిన డబ్బును ప్రియురాలి ఇంట్లో దాచినట్టు ఈడీ అధికారులు తేల్చారు. తాజాగా ముంబయి నగరంలోని జల్నా ప్రాంతంలో ఓ బడా వ్యాపారికి చెందిన కార్యాలయాలు, ఇళ్లపై ఐటీ అధికారులు ఒకేసారి దాడులు నిర్వహించారు. ఆ వ్యాపారి ఇంట్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు చూసి అధికారులు నోరెళ్ల బెట్టారు. ఆ డబ్బు లెక్కించేందుకు ప్రత్యేకంగా మిషన్లతో రంగంలోకి దిగిన సిబ్బందికి, 13 గంటల సమయం పట్టిందంటే ఎంత అక్రమ డబ్బు పోగేశారో అర్థం చేసుకోవచ్చు.

ముంబయిలో ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై ఉక్కు, బట్టల వ్యాపారి, రియల్ ఎస్టేట్ డెవలపర్‌కు చెందిన పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు నిర్వహించింది. ఐటీ అధికారుల తనిఖీల్లో వ్యాపారి నుంచి కళ్లు చెదిరే మొత్తంలో అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో 300 కోట్ల నగదు, 32 కిలోల బంగారం, ముత్యాలు, వజ్రాలు, ప్రాపర్టీ పేపర్లతో సహా దాదాపు 100 కోట్ల బినామీ ఆస్తులను అధికారులు సీజ్‌ చేశారు. అయితే ఈ ఆస్తులు ఎవరికి సంబంధించినవో, ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సదరు వ్యాపారి పలు వ్యాపారాలతో పాటు, హవాలా వ్యాపారం నిర్వహిస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో పలువురు రాజకీయ నాయకులు హవాలా కోసం ఈ వ్యాపారిని సంప్రదించినట్టు కూడా తెలుస్తోంది. దీనిపై ఐటీ అధికారులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంత డబ్బు ఒకేసారి వెలుగు చూడటం ఇటీవల కాలంలో ఇదే మొదటి సారి కావడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here