మేడ్చల్: రాష్ట్రస్థాయి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని మేడ్చల్ జిల్లాలో పెద్దఎత్తున నిర్వహించేందుకు ఆర్మీ, మేడ్చల్ జిల్లా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. హకీంపేట్ (శామీర్‌పేట మండలం తూంకుంట)లోని స్పోర్ట్ప్ స్కూల్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఈనెల 5 నుంచి 24వరకు నిర్వహిస్తారు. దీనికోసం అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇంచార్జి కలెక్టర్ శ్వేతామహంతి ఆదేశించారు. అన్నిజిల్లాల నుంచి ఈ ర్యాలీలో అభ్యర్థులు పాల్గొననున్నారు
