80 వేల ఓట్లు సాధించామనే తృప్తి మాకుంది: కోదండరాం

0
181
Spread the love

పైసలు లేకుండా స్వచ్ఛమైన, మలినం లేని 80 వేల ఓట్లు సాధించామనే తృప్తి తమకు ఉందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. గెలుపునకు రెండో ప్రాధాన్యత ఓట్లే కీలకం కానున్నాయన్నారు. తమ గెలుపు పై ఆశతో ఉన్నామన్నారు. కొందరు లక్షలు, కోట్లు ఖర్చు పెట్టినా తాము పైసా ఖర్చు పెట్టకున్నా 80 వేలు ఓట్లు వచ్చాయని అందరూ అంటున్నారన్నారు. పాలిటిక్స్‌లో ఒక బీజం నాటామని.. ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టేలా ముకుతాడు వేశామనే ఆత్మ సంతృప్తి తమకు ఉందని కోదండరాం తెలిపారు. 

Congress leaves Jangaon for Muddasani Kodandaram | The Siasat Daily -  Archive

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here