Homeఆంధ్రప్రదేశ్Trains Cancelled| రైల్వే ప్రయాణికులకు అలెర్ట్‌..! ఇంటర్‌ లాకింగ్‌ పనులతో పలు రైళ్లు రద్దు..!

Trains Cancelled| రైల్వే ప్రయాణికులకు అలెర్ట్‌..! ఇంటర్‌ లాకింగ్‌ పనులతో పలు రైళ్లు రద్దు..!

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్‌ను జారీ చేసింది. వాల్తేరు డివిజన్‌ పరిధిలోని పార్వతీపురం, గుమడ స్టేషన్ల మధ్య మూడో లైన్‌కు సంబంధించి ఇంటర్‌లాంకింగ్‌ పనుల కారణంగా పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటి దారి మళ్లించారు. ఈ నెల 29 నుంచి మార్చి 5 వరకు విశాఖపట్నం-భవానీపట్నం (08504) రైలును రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

అలాగే విశాఖ-కొరాపుట్‌ (08546), విశాఖ-రాయపూర్‌-విశాఖ (08528/08527) సైతం ఈ నెల 29 నుంచి మార్చి 5 వరకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. 29 నుంచి మార్చి 6 వరకు కొరాపుట్‌-విశాఖ(08545), మార్చి 1 నుంచి 6 వరకు భవానీపట్నం-విశాఖపట్నం (08503) రద్దయ్యాయి. మార్చి 1 నుంచి 4 వరకు విశాఖ-కొరాపుట్‌(18512) రైలు, మార్చి 2 నుంచి 5 వరకు కొరాపుట్‌-విశాఖపట్నం (18511) రైళ్లు నడవవని అధికారులు చెప్పారు.

ఇక ఈనెల 29, మార్చి 2, 3, 5 తేదీల్లో విశాఖ-నిజాముద్దీన్‌ (12807) ఎక్స్‌ప్రెస్‌ సైతం రద్దయ్యింది. మరో వైపు ఈ నెల 29, మార్చి 1 2, 4 తేదీల్లో నిజాముద్దీన్‌-విశాఖపట్నం (12808) ఎక్స్‌ప్రెస్‌ దువ్వాడ, విజయవాడ, బల్లార్షా మీదుగా దారి మళ్లించినట్లు తెలిపారు. మార్చి 2 నుంచి 5 వరకు కొరాపుట్‌-విశాఖపట్నం (18511) రైళ్లు రద్దయ్యాయి. ఈ నెల 29, మార్చి 2, 3, 5 తేదీల్లో విశాఖ-నిజాముద్దీన్‌ (12807) రద్దవగా.. ఈ నెల 29, మార్చి 1, 2, 4 తేదీల్లో నిజాముద్దీన్‌-విశాఖపట్నం (12808) రైళ్లు దువ్వాడ, విజయవాడ, బల్లార్షా మీదుగా దారి మళ్లించినట్లు అధికారులు వివరించారు.

RELATED ARTICLES

Most Popular