Homeఆంధ్రప్రదేశ్టీడీపీ కోవర్టుగా పురందేశ్వరి.. బీజేపీ అధిష్టానం చేతిలో సాక్ష్యం..?

టీడీపీ కోవర్టుగా పురందేశ్వరి.. బీజేపీ అధిష్టానం చేతిలో సాక్ష్యం..?

వెంకయ్య నాయుడు పేరుకు బీజేపీలో ఉన్నా మొదటి నుంచి టీడీపీకి కోవ‌ర్టుగా పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన పరంపరను పురందేశ్వరి కొనసాగిస్తూ వస్తున్నారు. వీరి అంతిమ లక్ష్యం చంద్రబాబు నాయుడుకి సాయం చేయడమే. అయితే.. పురందేశ్వరి బీజేపీ ముసుగులో టీడీపీ కోసం కష్టపడుతున్నట్లు బీజేపీ అధిష్టానానికి కూడా తెలిసిపోయిందట. అందుకు తగిన సాక్ష్యాలను కూడా సంపాదించారట. అందుకు తగిన చర్యలు కూడా తీసుకోనున్నట్లు ప్రచారం మొదలైంది.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే… గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేనలో టికెట్లు రానివారు, వైసీసీలో పక్కన పెట్టినవారు తమ రాజకీయ భవిష్యత్ కోసం బీజేపీ తలుపులు తట్టారు, కానీ బీజేపీ నేతలు స్పందించిన తీరుకు వారు ఆశ్చర్యపోయారు. బలమైన ఆర్థిక నేపథ్యం, రాజకీయ అనుభవం ఉన్న నేతలకు తెలుగుదేశం, జనసేన పార్టీలలో చోటు దక్కకపోవడంతో ప్రత్యామ్నాయంగా వారు రాష్ట్ర బీజేపీ నేతలను సంప్రదించారు… సరిగ్గా స్పందించకపోగా మీరు ఆయా పార్టీలలో ఉండటమే మీకు మేలు, అక్కడే మీకు న్యాయం జరుగుతుందని చెప్పి వెనక్కి పంపించేశారట.

ఇక వైసీపీ విషయానికొస్తే మాగుంటకు ఒంగోలు సీటును నిరాకరించాడు జగన్మోహన్ రెడ్డి, అలాగే నెల్లూరుకు చెందిన రాజ్యసభ స‌భ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని కూడా పక్కన పెట్టారు. వీరిద్దరూ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి భర్త అయిన దగ్గుబాటి వెంకటేశ్వర రావును కలిసి బీజేపీలో చేరతామంటూ తమ అభిష్టాన్ని బయటపెట్టగానే.. మేమే ఎందుకు వచ్చామా అని బాధ పడుతున్నాం, ఇక మీరెందుకు ఇక్కడ మీ భవిష్యత్ బాగుండాలి అంటే తెలుగుదేశంలో చేరండి అంటూ వారిని సాగనంపినట్లు సమాచారం.

కేంద్ర పెద్దలు క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేయండి అంటూ నమ్మకంతో పదవి ఇస్తే, పార్టీని బలోపేతం చేయడం పక్కన పెట్టి, తన కుటుంబ సభ్యుడైన చంద్రబాబుకు రాజకీయ లబ్ది చేకూర్చే విధంగా పురందేశ్వరి పని చేస్తుండటం విశేషం. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో బలపడి చక్రం తిప్పుతున్న బీజేపీ మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో మొదటి నుండి ఇలాంటి ప్రో తెలుగుదేశం నాయకుల చేతులలో ఉండటం వలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయింది.పేరుకు బీజేపీలో ఉంటారు కానీ వారి ఆలోచనలు, చర్యలు అన్నీ తెలుగుదేశం పార్టీకి ఎలా మేలు చేయాలి, ఎలా వృద్ధి చేయాలి అన్న కోణంలోనే ఉంటాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఈ మధ్య ఇలాంటి పార్టీ చేరికలు విషయమై పురందేశ్వరి మాట్లాడిన కాల్ ఆడియో రికార్డింగ్ ఒకటి బయటపడి కేంద్ర పెద్దల చేతుల్లోకి వెళ్లిందని సమాచారం, ఇది కాక ఇంటెలిజెన్స్ ద్వారా కూడా వారి దగ్గర పూర్తి సమాచారం ఉంది… వీటిని సీరియస్‌గా తీసుకుని నరేంద్ర మోడీ, అమిత్ షాలు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు అయిన పురందేశ్వరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.

RELATED ARTICLES

Most Popular