రియ‌ల్ట‌ర్ శ్రీనివాస్‌ హత్య కేసులో మ‌రో ట్విస్ట్‌

0
88
Spread the love

రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ హత్య కు ముందు కీలక నిందితుడు శివ.. హతుడి భార్యతో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ భార్యకు శివ దూరపు బందువుగా పోలీసులు గుర్తించారు. ఈకేసులో మొత్తం అయిదుగురి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన నిందితుడు శివతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం, మంగళపర్తి గ్రామ శివారలో ఇటీవల దుండగులు కారు డిక్కీలో మృతదేహాన్ని ఉంచి దహనం చేశారు. పోలీసుల దర్యాప్తులో కారులోని మృతదేహాన్ని ధర్మకారి శ్రీనివాస్‌దిగా గుర్తించ‌గా.. పోలీసులు ఈ కేసును ఛేదించారు. శ్రీనివాస్ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని నిర్థారించారు. రూ.కోటిన్నర వ్యవహారమే కారణమని, లోన్ తీసుకుని డబ్బులు ఇచ్చినా తిరిగి చెల్లించలేదనే కోపంతో హత్య చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here