బెజవాడ మిస్టరీ కేసు పురోగతి… తెర‌పైకి ఇండ‌స్ట్రీయ‌లిస్ట్ పేరు.. గ‌తంలోనూ ఆయ‌న‌పై ప‌లు కేసులు

0
100
Spread the love

విజయవాడ:రాహుల్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పద్మజ, గాయత్రి, పద్మజలను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఒక పద్మజ ఏ1 నింతితుడు కోడారి విజయ్ కుమార్ భార్య అనే సంగతి తెలిసిందే. మరో ఇద్దరు గురించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ముగ్గురిలో మహిళ రాహుల్‌కు రూ.6 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాహుల్‌కు అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎందుకు ఇచ్చారు..?

రాహుల్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్‌కుమార్‌… పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మాచవరం పోలీస్‌ స్టేషన్‌లో సరెండర్‌ అయ్యాడు. విజయ్‌కుమార్‌ సహా మొత్తం ఆరుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్‌ మర్డర్‌ కేసులో వారిని విచారిస్తున్నట్లు సమాచారం. రాహుల్‌లో కలిసి వ్యాపారం చేస్తున్న కోరాడ విజయ్‌కుమారే హత్య చేయించినట్లు పోలీసులు భావించారు. రాహుల్‌ మర్డర్‌ తర్వాత విజయ్‌కుమార్‌ పరారీ కావడంతో… అతడిపై అనుమానాలు బలపడ్డాయి.
రాహుల్‌ మర్డర్‌ కేసులో అనుమానితుడిగా ఉన్న కోరాడ విజయ్‌కుమార్‌ డ్రైవర్‌… బాబును మొన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నూజివీడు దగ్గర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బాబును అదుపులోకి తీసుకున్నారు. రాహుల్‌ హత్య జరిగిన రాత్రి నుంచి కారు డ్రైవర్‌ బాబు పరారీలో ఉన్నాడు. డ్రైవర్‌పై నిఘా పెట్టిన పోలీసులు.. నిన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు.

రాహుల్ తండ్రి రాఘవరావు ఫిర్యాదు మేరకు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా కోరాడ విజయ్‌కుమార్, ఏ2గా కోగంటి సత్యం పేర్లు చేర్చారు. ముగ్గురు మహిళల ప్రేమేయం కూడా రాహుల్ హత్యలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ హత్యతో పాత్రధారులుగా భావిస్తున్న పద్మజ అనే పేరుతో ఉన్న ఇద్దరు మహిళల పేర్లను కూడా ఏ3, ఏ4గా చేర్చారు. కోగంటి సత్యం ద్వారా ఫ్యాక్టరీ కొనుగోలుకు చర్చలు జరిగాయని… తన వాటా డబ్బుల కోసం కోరాడ విజయ్‌కుమార్ అనేకసార్లు ఒత్తిడి తెచ్చారని రాహుల్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోరాడ కుటుంబ సభ్యులకు హత్యతో సంబంధముందని రాహుల్ తండ్రి రాఘవరావు ఆరోపిస్తున్నారు. అయితే ఇవాళ కోరాడ విజయ్‌కుమార్‌ పోలీసులకు లొంగిపోయాడు.

కోగంటి సత్యం గురించి విజయ్‌కుమార్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కేసులో ఏ4, ఏ5గా ఉన్న తళ్లీ కూతుళ్లు.. గాయత్రీ, పద్మజల గురించి కూడా ప్రశ్నించినట్లు సమాచారం అందుతోంది. గాయత్రీ, పద్మజ పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. మాచవరం పీఎస్‌లో కోరాడ విజయ్‌కుమార్‌ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆరుగురు పోలీసుల అదుపులో ఉన్నారు.

గతంలో హైదరాబాద్‌లో జరిగిన వ్యాపారి రాంప్రసాద్‌ హత్య కేసులో కీలక నిందితుడైన శ్యామ్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నిన్న కోరాడ విజయ్‌ కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో మిగతా నిందితుల కోసం పోలీసులు అయిదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ నగరాల్లో గాలిస్తున్నారు. ఎవరెవరి పాత్ర ఉందనే అంశంపై ఆరా తీస్తున్నారు.

రాహుల్‌కు చెందిన జిక్సిన్ కంపెనీని తక్కువ ధరకే కొట్టేయాలని నిందితులు స్కెచ్ వేసినట్లు డ్రైవర్ బాబు పోలీసులకు తెలిపాడు. ఇదే అంశంలో గత ఏడాది కాలంగా కోరాడ విజయ్.. రాహుల్ పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడు. రూ. 15 కోట్లు విలువ చేసే జిక్సిన్ కంపెనీ30 శాతం వాటాను వెనక్కి ఇవ్వాలన్ని కోరాడు విజయ్. ఇందుకోసం రాహుల్‌పై ఒత్తిడి తీసుకువచ్చాడు. డబ్బుల కోసం రాహుల్‌ను ఇబ్బందులకు గురి చేశాడు. మరోవైపు విజయ్ వాటాను కొనేందుకు కోగంటి సత్యం ప్రయత్నించాడు. అతనికి కంపెనీలో షేర్ ఇచ్చేందుకు రాహుల్ నిరాకరించాడు. దాంతో రాహుల్‌ను హత్య చేయాలని వారు నిర్ణయించుకున్నారు. మూడు నెలల క్రితమే రాహుల్ హత్యకు భారీ స్కెచ్ వేశారు. రాహుల్ హత్యకు మాస్టర్ ప్లాన్ వేసింది కోగంటి టీమ్‌గా పోలీసులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here