చికెన్​తో బ్లాక్​ఫంగస్​.. ఇది అసలు విషయం!

Black fungus with chicken

0
88
Spread the love

వాతావరణంలో అంతటా ఉండే బ్లాక్​ ఫంగస్​.. కోళ్లకి కూడా వస్తుందని, కానీ, ఆ కోళ్ల ద్వారా, చికెన్​ ద్వారా మనుషులకు బ్లాక్​ఫంగస్​ వ్యాపిస్తుందన్న వాదనలో అర్థం లేదని ఇండియన్ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్ రీసెర్చ్​ (ఐసీఎంఆర్​) సీనియర్​ సైంటిస్ట్ డాక్టర్ అపర్ణ ముఖర్జీ చెప్తున్నారు. అసలు బ్లాక్​ ఫంగస్​ అంటువ్యాధి కాదని, అలాంటప్పుడు జంతువులు, మనుషుల్లో ఒకరి ద్వారా మరొకరికి సోకుతుందన్న వాదనలో నిజం లేదని ఆమె స్ఫస్టత ఇచ్చారు. కాబట్టి చికెన్​కి భయపడాల్సిన అవసరం లేదని ఆమె అంటున్నారు.

వీటికితోడు నల్లగా ఉండే ఉల్లిగడ్డల ద్వారా బ్లాక్​ఫంగస్​ వస్తోందని ఈ మధ్య సామాజిక మాధ్య‌మాల్లో ఓ వార్త ప్రచారమవుతోంది. ఫ్రిజ్​లో నల్లగా పేరుకుపోయిన ఫంగస్​ వల్ల కూడా సోకే అవకాశముందని వాట్సాప్ లో మెస్సేజ్​లు స‌ర్కులేట్ అవుతున్నాయి. ఉల్లిగడ్డలపై కనిపించే నల్లని పొర భూమిలో ఉండే ఫంగస్​ వల్ల వస్తుంది. కట్​ చేసేటప్పుడు దానిని కడిగి తినడం మంచిది.

ఏదైనా జంతువుకి ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకితే వాటి నుంచి భయంకరమైన దుర్వాసన వస్తుంది. ఆ కుళ్లిన వాసనతో కోళ్లకు ఫంగస్​ సోకినట్లు గుర్తించవచ్చని ఐసీఎఆర్​ సైంటిస్ట్​ డాక్టర్ ఎంఆర్ రెడ్డి చెప్తున్నారు. ఆ వాసన వచ్చిన మాంసాన్ని తినలేరు కదా. అయితే ఇప్పటివరకు జంతువులకు బ్లాక్​ఫంగస్​ సోకిన కేసులు నిర్ధారణ కాలేదని, దానిపై ఎలాంటి అధ్యయనాలు జరగలేదని ఎంఆర్​రెడ్డి చెప్తున్నారు. అయితే కోళ్లను, బాతులను ముద్దు చేయడం ద్వారా సాల్మొనెల్లా ఇన్​ఫెక్షన్​ సోకుతుందని, ఇది సాధారణమైన ఇన్​ఫెక్షన్​ కలుగజేస్తుందని అన్నారు. బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదని ఎయిమ్స్​ డైరెక్టర్​, పల్మనాలజిస్ట్​ అయిన రణ్దీ​ప్​ గులేరియా ఇది వరకే స్పష్టం చేశారు. మ్యూకర్ అనే ఫంగస్ కారణంగా ఈ మ్యుకర్మైకోసెస్ వస్తుందని చెబుతూనే.. అపోహలపై క్లారిటీ ఇచ్చారాయన. ఇక యునైటెడ్ స్టేట్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇది చాలా ప్రాణాంతకమైన ఫంగస్ ఇన్ఫెక్షన్ అని చెప్పింది. ఇమ్యూనిటి ప‌వ‌ర్ త‌క్కువ‌గా ఉండ‌టం, స్టెరాయిడ్స్ అధికంగా వాడటం, షుగర్ పేషెంట్లకు ఫంగస్​ల వల్ల ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here