రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్తాత్మకంగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా పాన్ ఇండియన్ రేంజ్‌లో ఈ సినిమా భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ భానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇంతకముందు కొమరం భీమ్ గా ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా చరణ్ లుక్స్ రిలీజ్ చేసిన రాజమౌళి బృందం తాజాగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఆలియా భట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ లుక్ రిలీజైన కొద్ది సేపట్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కాగా చరణ్ కి జంటగా సీత పాత్రలో ఎంతో పవర్‌ఫుల్ రోల్ చేస్తోంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ అన్నీ ప్రధాన భాషల్లో అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, శ్రీయ శ్రణ్, ఎన్టీఆర్‌కి జంటగా బ్రిటన్ మోడల్ ఒలివియా మోరిస్ నటిస్తోంది.
