దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్తాత్మకంగా తెరకెక్కుతున్న లేస్టెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. భారీ మల్టీస్టారర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ భానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఆలియా భట్ చరణ్ కి జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. సీతగా పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతోంది. కాగా తాజాగా ఈ సినిమా నుండి అలియా భట్‌కి సంబంధించి ఒక సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఆలియా భట్ లుక్‌ను మార్చి 15న ఉదయం 11 గంటలకు రివీల్ చేయబోతున్నట్టు రాజమౌళి బృందం ప్రకటించారు.

ఇప్పటికే కొమరం భీమ్ గా ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా చరణ్ లుక్స్ రిలీజై అటు మెగా అభిమానులను ఇటు నందమూరి అభిమానులను ఆకట్టున్న సంగతి తెలిసిందే. అంతేకాదు భీమ్ ఫర్ రామరాజు, రామరాజు ఫర్ భీమ్ టీజర్ వచ్చి తారా స్థాయిలో అంచనలాను పెంచాయి. మరికొన్ని రోజుల్లో రాబోతున్న ఆలియా భట్ లుక్‌తో ఆ అంచనాలు రెట్టింపు అవుతాయంటున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, శ్రీయ శ్రణ్, ఎన్టీఆర్‌కి జంటగా బ్రిటన్ మోడల్ ఒలివియా మోరిస్ నటిస్తోంది. కాగా ఈ సినిమా అన్నీ ప్రధాన భాషల్లో అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.