ఇలాంటి అభిమాని ఉంటే ఇంకేం కావాలి: హీరో

0
278
Spread the love

పైన ఫొటో చూశారా? బాలీవుడ్‌ యంగ్‌ హీరో విక్కీ కౌశల్‌ సమోసా తింటున్నాడు.

Vicky Kaushal Eat Samosa, Jalebi Brought by Fan - Sakshi

అందులో వింతేముంది? అంటారా? అక్కడికే వస్తున్నాం.. ఇండోర్‌కు చెందిన హర్షిత అనే యువతికి విక్కీ కౌశల్‌ అంటే వీరాభిమానం. అతడిని ఎలాగైనా కలవాలని ఇంట్లో చెప్పాపెట్టకుండా ముంబైకి వచ్చింది. నటుడి కోసం వేడివేడి సమోసా, జిలేబీలు కూడా తీసుకొచ్చింది. వాటిని చూడగానే ఎక్కడలేని ఆకలి పుట్టుకొచ్చింది విక్కీకి. ఇంకేముందీ, ఆవురావురుమంటూ సమోసా తింటున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశాడు.నాకు ఆకలిగా ఉందని తెలిసి తినడానికి ఇవన్నీ పట్టుకొచ్చే అభిమాని ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని రాసుకొచ్చాడు. ఇండోర్‌ సమోసా రుచికరంగా ఉందని చెప్పుకొచ్చాడు. మహిళా అభిమానులు విక్కీ మీద ఇలా ప్రేమ కురిపించడం ఇదేం తొలిసారి కాదు. గతేడాది అక్టోబర్‌లోనూ అభిమానులతో సెల్ఫీలు తీసుకుంటున్న వీడియో ఆ మధ్య సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా విక్కీ నటించిన బాక్సాఫీస్‌ హిట్‌ చిత్రం ఉరి: ద సర్జికల్‌ స్ట్రైక్ విడుదలై జనవరి 11 నాటికి రెండేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా విక్కీ నటిస్తున్న తాజా చిత్రం ‘అశ్వత్థామ’ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇదిలా వుంటే విక్కీ ప్రస్తుతం సర్దార్‌ ఉద్దమ్‌ సింగ్‌తో పాటు, విజయ్‌ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో నటిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here