ఎఫ్ 3 : వెంకీ, వరుణ్ ఇంత షాకిచ్చారేంటీ..?

0
428
Spread the love

ఎఫ్ 2 సినిమాతో భారీ హిట్ అందుకున్నారు చిత్ర యూనిట్ మొత్తం. హీరోలుగా నటించిన విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. హీరోయిన్స్ మిల్కీ బ్యూటీ తమన్నా, యంగ్ బ్యూటీ మెహ్రీన్..దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజుల కెరీర్‌లో ఎఫ్ 2 ఒక స్పెషల్ సినిమాగా నిలిచిపోతుంది. అయితే ఇదే కాంబినేషన్‌లో ఎఫ్ 3 చేయాలని నిర్మాత దిల్ రాజు – దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేసుకున్నారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత మొదలవ్వాల్సిన ఈ సినిమా కాస్త డిలేగా మొదలైనప్పటికీ షూటింగ్ మాత్రం జెట్ స్పీడ్‌లో జరుగుతుందని తాజా సమాచారం. దాదాపు ఎఫ్ 2 టీమ్ ఎఫ్ 3కి పని చేస్తోంది. ప్రధానంగా ఎఫ్ 2 కాంబినేషన్ అయిన వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ఎఫ్ 3కి రిపీటవుతుండటం విశేషం.

కాగా ఈ సినిమా మేజర్ టాకీ పార్ట్ పూర్తి చేసినట్టు లేటెస్ట్ అప్‌డేట్. వెంకీ, వరుణ్‌ల కాంబినేషన్ సీన్స్‌ని చాలా తక్కువ సమయంలో పూర్తి చేశారట. అసలు ఇంత త్వరగా టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుందని దర్శక, నిర్మాతలు అనుకోలేదని ..ఈ ఉత్సాహంతో మరొక వైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా పూర్తి చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఆగస్టు 27న ఫన్ అండ్ ఫ్రష్టేషన్ డబుల్ డోస్‌తో ఎఫ్ 3 సినిమాని భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటి వరకు ఫ్లాప్ అంటూ ఎరగని దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్ 3తో మరో భారీ హిట్ అందుకోబోతున్నట్టు చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here