కొత్తిల్లు కొన్న బాలయ్య!

0
181
Spread the love

సీనియర్ హీరో, నటరత్న నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తాజాగా ఓ ఇంటిని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లోని ఓ ఖరీదైన ప్రాంతంలో రూ.15 కోట్లకు ఓ ఇంటిని ఈ నెల 11వ తేదీన బాలయ్య కొనుగోలు చేశారట. రెండంతస్థుల ఆ ఇల్లు బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర పేరు మీద రిజిస్టర్ అయిందట. 9,395 చ.అ. విస్తీర్ణం గల ఆ ఇంటి కోసం బాలయ్య రూ. 7.5లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు, రూ. 82.5లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారట.

బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను రూపొందిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గాడ్‌ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ తర్వాత క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమాను బాలయ్య పట్టాలెక్కించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here