సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ‘క్రాక్’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా విడుదలకు ముందు నిర్మాత ఠాగూర్ మధు కొన్ని సమస్యలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకుల సంఘంలో నిర్మాత మధుపై ఫిర్యాదు చేశారు. తనకు రావాల్సిన రెమ్యునేషన్‌ను ఇంకా నిర్మాత మధు చెల్లించడం లేదని గోపీచంద్ మలినేని ఫిర్యాదు మేరకు డైరెక్టర్స్ అసోసియేషన్, నిర్మాతల మండలికి లేఖ రాసిందట. ఇప్పుడు నిర్మాత ఠాగూర్ మధు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. డాన్ శీను, బలుపు చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో క్రాక్ సినిమా రూపొంది హ్యాట్రిక్ హిట్‌గా నిలిచింది. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించారు.