గొప్ప కథ కనిపించింది!

0
215
Spread the love

ఇటీవల జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డ మీదే ఓడించి భారత్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విజయం అందరికీ చాలా మంచి జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఇప్పుడు ఈ టెస్ట్‌ సిరీస్‌పై ఓ పుస్తకాన్ని రాస్తున్నట్లు ప్రకటించారు బాలీవుడ్‌ నటి సయామీ ఖేర్‌.

Saiyami Kher to capture Indian cricket team historic win - Sakshi

ఈ పుస్తకం రాయడం వెనక ఉన్న కారణం గురించి సయామీ మాట్లాడుతూ – ‘‘క్రికెట్‌ అభిమానిగా నాకిదో బెస్ట్‌ మూమెంట్‌. క్రికెట్‌ చరిత్రలో ఇదో బెస్ట్‌ కమ్‌బ్యాక్‌. ఇందులో గొప్ప అండర్‌ డాగ్‌ కథ కనిపించింది. ఎలాంటి కష్టం ఎదురైనా సరే, లేచి నిలబడి విజయం సాధించొచ్చు అని ఈ సిరీస్‌ చెప్పింది. అందుకే పుస్తకం రాయాలనుకున్నాను. ఈ పుస్తకం రాయడం చాలా ఎగ్జయిటింగ్‌గా, ఎమోషనల్‌గా ఉంది’’ అని అన్నారు. ఆ సిరీస్‌ ఆడిన పలువురి క్రికెటర్స్‌ అనుభవాలను కూడా పుస్తకంలో పొందుపరచాలనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here