గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌.. కోటి వృక్షార్చనకు అండగా సూపర్‌ స్టార్‌

0
206
Spread the love

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ మహా ఉద్యమంలా మారి దేశవ్యాప్తంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఈ ఛాలెంజ్‌లో వారూ, వీరూ అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటుతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటి, వారి అభిమానులను కూడా మొక్కలు నాటాల్సిందిగా కోరారు. అల్రెడీ ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటిన సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు.. మరొక్కసారి ఈ ఛాలెంజ్‌కు సపోర్ట్‌గా నిలిచారు. తన పిల్లలతో పాటు తనూ మొక్కలు నాటిన వీడియోని షేర్‌ చేసిన మహేష్‌ బాబు.. ఎంపీ సంతోష్‌ కుమార్‌ చేపట్టిన కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరూ భాగం కావాల్సిందిగా కోరారు.

ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ట్విట్టర్‌ ద్వారా ఓ వీడియోని షేర్‌ చేసి ”భూతాపాన్ని (గ్లోబల్‌ వార్మింగ్) తగ్గించాలంటే మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడమే పరిష్కారం. ఎంపీ సంతోష్‌ కుమార్‌గారు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తీసుకున్న కోటి వృక్షార్చన కార్యక్రమానికి అండగా ఉందాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి పుట్టినరోజైన ఫిబ్రవరి 17న కోటి మొక్కలు నాటే ఉద్యమంలో పాల్గొందాం..” అని పేర్కొన్నారు. మహేష్‌ బాబు షేర్‌ చేసిన వీడియోలో తనతో పాటు గౌతమ్‌, సితారలు మొక్కలు నాటుతున్నారు. ఇంతకు ముందు ఈ ఛాలెంజ్‌ స్వీకరించిన మహేష్‌ బాబు.. తమిళ స్టార్‌ హీరో విజయ్‌కి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి, నటి శృతిహాసన్‌కు ఈ ఛాలెంజ్‌ విసిరిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here