త్వరలో పెళ్లి పీటలెక్కనున్న హీరో!

0
209
Spread the love

ప్రముఖ నిర్మాత, డర్టీ హరి దర్శకుడు ఎమ్‌ఎస్‌ రాజు ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది.

MS Raju Son, Hero Sumanth Ashwin To Tie The Knot

ఆయన తనయుడు, హీరో సుమంత్‌ అశ్విన్‌ తొందర్లోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సమాచారం. దీపిక అనే అమ్మాయితో ఆయన వివాహం జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కాలం కాబట్టి తక్కువ మంది సమక్షంలోనే అదీ హైదరాబాద్‌లోనే ఈ పెళ్లి తంతును కానిచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే హీరో సుమంత్‌ అధికారికంగా ప్రకటించేవరకు వేచిచూడాల్సిందే!ఇక సుమంత్‌ కెరీర్‌ విషయానికి వస్తే.. తండ్రి ఎమ్‌ఎస్‌ రాజు డైరెక్షన్‌లో ‘తూనీగ తూనీగ’ సినిమా ద్వారా వెండితెరపై అడుగు పెట్టాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తాకొట్టింది. తర్వాత ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో చేసిన ‘అంతకు ముందు ఆ తరువాత’ హిట్‌ టాక్‌ సొంతం చేసుకోవడంతో కొంత బూస్ట్‌ వచ్చినట్లైంది. ఇక మూడో చిత్రం ‘లవర్స్’‌ మాత్రం అతడికి కమర్షియల్‌ బ్రేకిచ్చి హీరోగా నిలబెట్టింది. ప్రస్తుతం ఇతడు శ్రీకాంత్‌, భూమిక, తాన్యా హోప్‌తో కలిసి ‘ఇదే మా కథ'(రైడర్స్‌ స్టోరీ)లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు గురుపవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here