హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబుకు బల్దియా ఎన్‌ఫోర్స్‌మెంట్ షాకిచ్చింది. ఎల్‌ఈడీ లైట్లతో కూడిన భారీ హోర్డింగ్‌ను ఇంటి బయట ఏర్పాటు చేసినందుకు గాను ఏకంగా లక్ష రూపాయల జరిమానా విధించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం చలాన్ జారీ చేసింది. ఎటువంటి ముందస్తు లిఖిత పూర్వక అనుమతి లేకుండా ప్రకటన బోర్డును ఏర్పాటు చేసినందుకు గాను ఈ జరిమానా విధిస్తున్నట్టు అందులో పేర్కొంది. ఇంటి ముందు ఏర్పాటు చేసిన అడ్వైర్‌టైజ్‌మెంట్ బోర్డు భవనం ఫ్రంటేజ్‌కు 15 శాతం మించిపోయిందని తెలిపింది. ముందస్తు అనుమతి లేకుండా ఇలాంటివి ఏర్పాటు చేయడం సంబంధిత సెక్షన్ల ప్రకారం నేరమని, కాబట్టి జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నట్టు పేర్కొంది.
