నాతో సినిమా చేయమని అడిగాను: పవన్ కల్యాణ్

0
190
Spread the love

దశాబ్దం కిందటే భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలు నిర్మించి విజయాలు సాధించిన ఘనత ఏఎం రత్నందే అని పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రశంసించారు. తెలుగు, తమిళ చిత్రాల మార్కెట్ పరిధి విస్తరించడంలో ఏఎం రత్నం పాత్ర మరువలేనిదన్నారు. ఈ రోజు (గురువారం) ఏఎం రత్నం జన్మదినోత్సవం. ఈ సందర్భంగా ఆయనకు పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏఎం రత్నంతో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు.

నాతో సినిమా చేయమని ఇప్పటివరకు ఎవరినీ అడగలేదు. ఒక్క రత్నం గారిని మాత్రమే అడిగాను. ఆయనతో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. రత్నంగారి బంధువు ఒకరు నాకు నెల్లూరులో సన్నిహిత మిత్రుడు. ఆ పరిచయంతో రత్నంగారిని చెన్నైలో కలుస్తుండేవాణ్ణి. ఆయనఖుషీసినిమాను నిర్మించి నాకు మరచిపోలేని హిట్ ఇచ్చారు. సినిమాలో కళాత్మకత ఎక్కడా తగ్గకుండానే వాణిజ్య అంశాలను, ఆధునిక సాంకేతికత మేళవించి మన సినిమాల మార్కెట్ పరిధి పెంచారు. ఆయన మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నానని పవన్ అన్నారు. ప్రస్తుతం ఎ.ఎమ్.రత్నం నిర్మాణంలో పవన్ ఓ భారీ సినిమా చేస్తున్నారు. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here