నిధి బంపరాఫర్ కొట్టేసిందా?

0
178
Spread the love

సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్ గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగులో తొలి విజయం అందుకుని మరిన్ని అవకాశాలు దక్కించుకుంటోంది. తెలుగుతోపాటు తమిళంలోనూ సినిమాలు చేస్తోంది. తాజాగా నిధి ఓ బంపరాఫర్ కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సరసన మెరిసే అవకాశం నిధి దక్కించుకుందట. పవన్ హీరోగా డైరెక్టర్ క్రిష్ ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా నిధి ఎంపికైందట. బాలీవుడ్ ప్రముఖ కథానాయిక జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరో హీరోయిన్‌గా కనిపించనుందట. మరి, ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here