నిహారిక, చైతన్య పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. మెగా ఫ్యామిలీలో సంబరాలు షురూ..

0
451
Spread the love

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో పెళ్లిల సీజన్ నడుస్తోంది. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు అనే తేడా లేకండా ఒకరి తర్వాత ఒకరు మూడు ముళ్ల బంధంతో ఒకటైవుతున్నారు. రీసెంట్‌గా కాజల్ అగర్వాల్.. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను కొంత మంది బంధు మిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఇపుడు నిహారిక, చైతన్యల పెళ్లికి మూహూర్తం ఖరారైంది. ఇప్పటికే నిహారిక, చైతన్యల నిశ్చితార్ధ వేడుక ఎంతో ఘనంగా నిర్వహించారు ఇరు కుటుంబ సభ్యులు. తాజాగా నిహారిక, చైతన్యలకు సంబంధించిన పెళ్లి డేట్ ఖరారైంది. వీరి పెళ్లి డిసెంబర్ 9వ తేదిన రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఖరారైనట్టు వరుడి తండ్రి, గుంటూరు ఐజీ జే. ప్రభాకర రావు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రభాకర రావు దంపతులు వెేంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివాహా పత్రికను స్వామి వారి దగ్గర ఉంచి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వేద పండితులు ప్రభాకర రావు దంపతులను వేద ఆశీర్వచనం అందించారు. వీరి పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని ఉదయ్ విలాస్‌ను పెళ్లి వేదికగా ఖరారు చేసినట్టు తెలిపారు.

మెగా డాటర్ నిహారిక నిశ్చితార్ధం వెంకట చైతన్య జొన్నలగడ్డతో ఇరు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ తప్పించి మిగతా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఆ తర్వాత పెళ్లి పనుల్లో అత్యంత ముఖ్యమైన పసుపు దంచే కార్యక్రమం కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా.

చైతన్య విషయానికొస్తే.. ఈయన హైదారాబాద్‌లోనే పుట్టి పెరిగాడు. జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌లో ఈయన చదువు పూర్తి చేశారు. బిట్స్ పిలానీలో లెక్కల్లో మాస్టర్ డిగ్రీ చేసాడు. అంతేకాదు హైదరాబాద్‌కు చెందిన ఓ మల్టీ నేషనల్ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్‌గా పనిచేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here