మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో.. వరుస సక్సెస్‌ఫుల్ చిత్రాల నిర్మాతగా పేరు గడించిన బన్నీ వాసు నిర్మాతగా.. ఎనర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ, లవ్‌లీ బ్యూటీ లావణ్య త్రిపాఠి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి రూపొందించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ”చావు కబురు ఎప్పుడూ చల్లగా చెప్పాలి. పుష్ప గురించి చివరిలో చెప్పాలి. ఈ సినిమా గురించి ఓ పిట్టకథ ఉంది. వాసు గురించి ఒక్క లైన్‌లో చెప్పాలంటే నేను ఇవాళ ఇలా ఉన్నానంటే.. మా నాన్నగారి కంటే ఎక్కువ వాసు కారణం. గంగోత్రి నుంచి ట్రావెల్ అవుతున్నాం. అద్భుతమైన సినిమాలు చేశాడు. 100 పర్సెంట్ లవ్, గీత గోవిందం, భలేభలే మగాడివోయ్ వంటి సినిమాలు చేశాడు. అలాంటి వాసుకు కథ నచ్చడం చిన్న విషయం కాదు. ఎక్కడి నుంచి వచ్చింది కథ అంటే.. నవదీప్ విని మాకు పంపించాడు. అందుకు నవదీప్‌కి థ్యాంక్స్. శరత్ అంటే నాకన్నీ.. శరత్ నాతో పని చేస్తున్నాడు అనేకంటే నా ఫ్యామిలీ అంటే బావుంటుంది. నేనొక్కడినే పెరిగితే సరిపోదు.. చుట్టు పక్కలా అంతా పెరగాలి. వాసు సింపుల్‌గా మూడు ముక్కల్లో కథ చెప్పాడు. చాలా బాగుంది కథ అన్నాను. ఇవాళ ఈ సినిమా నేను చూశాను. నా సినిమా గురించి నేను చెప్పలేను కానీ పక్కనోడి సినిమా గురించి చెప్పగలను. చాలా బాగుంది.
దర్శకుడు కౌశిక్ గురించి చెప్పాలి. ఈ సినిమా చూస్తున్నపుడు ఏజ్ ఎంత అని వాసుని అడిగాను. 26 ఏళ్ళకే ఇంత మెచ్యూరిటీనా.. నాకు రెండు మూడేళ్ల కింద వచ్చిన మెచ్యూరిటీ ఈయనకు ఇప్పుడే వచ్చింది. అందరికీ హిట్ ఇవ్వబోయే దర్శకుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు సిగ్గేసింది నీ మెచ్యూరిటీ చూసి. నేను మీకు బస్తీ బాలరాజు గురించి చెప్పాలి.. కార్తికేయ ఏజ్ ఎంత..? 27, 28 కి ఇంత బాగా చేస్తున్నారు. నేనేం చేసాను ఆ వయసులో.. వీళ్లేంటి ఇంత బాగా చేస్తున్నారు అనుకున్నాను. బస్తీ బాలరాజు గుండెల్లోకి వెళ్తారు. అణువణువు ఇంకిపోయి ఉన్నాడు. ఈ రోజు కార్తికేయ మాట్లాడిన విధానం చాలా బాగా నచ్చింది. సినిమా చూసిన తర్వాత బాలరాజు.. ఇప్పుడు మీ మాటలు బాగా నచ్చాయి. తన జెన్యూన్ వర్క్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమాకు పని చేసిన బిజాయ్స్ నంబియార్ గారికి.. ఆయన మలయాళ సినిమా కల్కికి మంచి మ్యూజిక్ ఇచ్చారు. లావణ్య త్రిపాఠికి గీతా ఆర్ట్స్ లో మూడో సినిమా చేస్తుంది. ఆమె మా లక్కీ హీరోయిన్. ఆమని గారి గురించి చెప్పాలి.. మేం మీ సినిమాలు చూస్తూ పెరిగాం.. మీరెప్పుడెప్పుడు వస్తారా అని చూస్తున్నాం. ఈ రోజు మీకు ఇంత మంచి సినిమాతో వచ్చారు. అమ్మా చాలా బాగా చేసారు మీరు. శుభలగ్నం, మావిచిగురు లాంటి సినిమాలు చూస్తూ పెరిగాం. మా అందరికీ చాలా ఇష్టమైన ఆర్టిస్ట్ మీరు. మీలాంటి వాళ్లు సినిమాలు చేయడం ఆనందంగా ఉంది.
తెలుగు ప్రేక్షకులకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. థియేటర్స్ కు వస్తారా అనుకుంటే మీరు సినిమా తీయండి వస్తాం అని భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలు. క్రాక్ గానీ, ఉప్పెన గానీ అందరికీ థ్యాంక్స్. పుష్ప గురించి ఒక్కమాట చెబుతాను. మీరు నా బలం.. ఆర్మీ.. ప్రాణం.. స్వతహాగా సంపాదించుకున్నానంటే అది కార్ కాదు, కోట్లు కాదు.. మీ అభిమానం మాత్రమే. గర్వపడేంత వరకు తీసుకెళ్తాను. ఇది నా ప్రామిస్. సుమ గారికి థ్యాంక్స్. చావు కబురు చల్లగా మీకు కూడా నచ్చుద్ది. ఈ సినిమాలో కొత్త విషయం ఉంది. పుష్ప గురించి ఒకే మాట.. పుష్ప తగ్గేదే లే..” అని తెలిపారు.