పవన్27.. లీకైన ఫొటో వైరల్!

0
189
Spread the love

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వకీల్‌సాబ్ను విడుదలకు రెడీ చేసిన పవన్ ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. మొఘల్ కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి హరి హర వీరమల్లు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఏఎమ్ రత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్స్ నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు పవన్ హాజరవుతున్నారు.

షూటింగ్ స్పాట్ నుంచి లీకైన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో పవన్ జానపద తరహా దుస్తులు ధరించి ఉన్నారు. ఈ ఫొటోను పవన్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా అప్‌డేట్ రాబోతోంది. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమాకు స్వరాలందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌ షూటింగ్‌లో కూడా పవన్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here