పాట పాడబోతున్న పవన్ కళ్యాణ్..!

0
242
Spread the love

మన స్టార్ హీరోలు అప్పుడప్పుడు పాట పాడుతూ అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ సహా పలువురు స్టార్ హీరోలు తమ సినిమాలలో పాట పాడుతున్న విషయం తెలిసిందే. వీరిలో ఎక్కువగా పవర్ స్టార్ పాటలు పాడుతూ ఫ్యాన్స్‌ని ఉత్సాహ పరుస్తున్నాడు. ఇప్పటికే ఖుషీ, జానీ, గుడుంబా శంకర్, అత్తారింటికి దారేది, అజ్ఞాత వాసి సినిమాలలో పాటలు పాడిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి పవన్ కళ్యాణ్ పాట బోతున్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇటీవల తెలిపాడు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రానా దగ్గుబాటి మరొక హీరోగా నటిస్తుండగా యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకి త్రివిక్రం శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా త్వరలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా థమన్ ..అయ్యప్పనుం కోషియం సినిమా కోసం పవర్ స్టార్ ఒక పాట పాడబోతున్నట్టు వెల్లడించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here