పాన్ ఇండియన్ స్టార్‌నే పూజా హెగ్డే డామినేట్ చేస్తుందా..?

0
372
Spread the love

ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఉన్నవన్ని పెద్ద సినిమాలే. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న పూజా హెగ్డే రీసెంట్‌గా కోలీవుడ్‌లో గోల్డెన్ ఛాన్స్ అందుకుంది. మాస్టర్ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా మారిన విజయ్ నటించబోతున్న లేటెస్ట్ సినిమాలో పూజా హెగ్డేని హీరోయిన్‌గా ఎంచుకున్నారు. ఎప్పటి నుంచో కోలీవుడ్ సినిమాలలో అవకాశల కోసం ఎదురు చూస్తున్న పూజా హెగ్డేకి ఏకంగా పాన్ ఇండియన్ సినిమాలో అవకాశం దక్కడం హాట్ టాపిక్‌గా మారింది. ఇలా మూడు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్స్ కమిటవుతున్న పూజా హెగ్డే త్వరలో రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డార్లింగ్ ప్రభాస్ కెరీర్‌లో తెరకెక్కుతున్న 20వ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహ్సితున్నాడు.

గోపీకృష్ణ మూవీస్, టీ – సిరీస్ గుల్షన్ కుమార్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ – ప్రమోద్ – ప్రసీదా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. రాధే శ్యామ్ మోషన్ పోస్టర్‌లో సలీమ్ – అనార్కలీ, లైలా – మజ్ఞు, దేవదాస్ – పార్వతీలను చూపించిన తర్వాత ప్రభాస్ – పూజా పోషిస్తున్న విక్రమాదిత్య – ప్రేరణలని రివీల్ చేశారు. దాంతోనే కంప్లీట్ రొమాంటిక్ లవ్ స్టోరీ అని క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమా సెకండ్ ఆఫ్‌లో పూజా హెగ్డే పర్ఫార్మెన్స్ ప్రభాస్‌ని డామినేట్ చేసే విధంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ రాధే శ్యామ్ సినిమాలో విక్రమాదిత్య – ప్రేరణల అమరప్రేమను వెండితెర మీద ఆవిష్కరించబోతున్నాడు దర్శకుడు రాధకృష్ణ. కాగా ఈ సినిమా జూలై 30న తెలుగు-హిందీ-తమిళ భాషల్లో రిలీజ్ కాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here