పారితోషికాన్ని భారీగా పెంచిన రవితేజ.. ఎంతంటే..

0
279
Spread the love

‘క్రాక్‌’తో కిరాక్‌ హిట్‌ కొట్టి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు మాస్‌ మహారాజ రవితేజ. ఈ సినిమా ఇచ్చిన కిక్‌తో వరుస సినిమాలకు ఓకే చెబుతూ.. అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ‘ఖిలాడి’తో బిజీగా ఉన్న ఈ మాస్‌ హీరో.. తాజాగా తన 68వ చిత్రాన్ని ఫైనల్‌ చేశాడు. ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ఈ సినిమాను చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేర్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Ravi Teja Hikes His Remuneration For His 68th Film

ఇదిలా ఉంటే రవితేజ తన 68వ సినిమాకు రెమ్యునరేషన్‌ని భారీగా పెంచారని ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం మేరకు కొత్త సిసిమాలకు రవితేజ రూ.16 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారట. ‘క్రాక్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కలెక్షన్లు భారీగానే వచ్చాయి. అంతేకాదు, రవితేజకు ఈ సినిమా పూర్వ వైభవం తీసుకొచ్చింది. అందుకే, ఈ సినిమా తరవాత రవితేజ తన రెమ్యునరేషన్‌ని పెంచిట్లు తెలుస్తోంది.

మాస్‌ మహారాజ సినిమాలంటే మినిమం గ్యారెంటీ అనే పేరు ఎలాగో ఉంది.దానికి తోడు ఇటీవల విడుదలైన క్రాక్‌ కలెక్షన్ల వర్షం కురిపించడంతో నిర్మాతలు కూడా రవితేజ డిమాండ్ చేస్తోన్న రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారట. ‘ఖిలాడీ’ సినిమా పూర్తి అయిన వెంటనే రవితేజ ఈ కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here