అందాల ముద్దుగుమ్మ అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. అప్పుడప్పుడు తన పోస్ట్‌లతో నెటిజన్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తూ ఉంటుంది. తాజాగా ఈ హాట్ యాంకర్ ఇచ్చిన షాక్‌కు ప్రతి ఒక్కరు నోరెళ్ళపెట్టారు. వివరాలలోకి వెళితే .. తెలంగాణ చిత్రపురి చలన చిత్రోత్సవం అందాల భామ అనసూయను గౌరవిస్తూ ఆమె ఫొటోతో ఉన్న పోస్టల్ స్టాంప్‌తో సత్కరించింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని తెలియజేసిన అనసూయ వారికి కృతజ్ఞతలు తెలిపింది.

జీవితంలో ఇంతకు మించిన అపారమైన గౌరవం ఏం ఉంటుంది . నేను ఏం చేశానో తెలియదు. నాకు ఈ గౌరవం దక్కినందుకు సంతోషంగా ఉంది. నన్ను ప్రోత్సహించడానికి మీరు చేస్తున్న గొప్ప ప్రయత్నమిది. మీరు చేస్తున్న గొప్ప పనుల కోసం నేను చేయగలిగినదంతా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటూ అనసూయ ఎమోషనల్ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బుల్లితెరతో పాటు వెండితెరపై సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే.