కరోనా తగ్గుముఖం పట్టడం, థియేటర్లకు పూర్తి స్థాయి అనుమతులు వచ్చేయడం వంటి కారణాలతో తమ సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు పోటీలు పడుతున్నారు. చకచకా విడుదల తేదీలను ప్రకటించారు. వేసవి నుంచి వారం వారం గ్యాప్‌లో పలు భారీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇక, కొన్ని క్రేజీ సినిమాలు ఓకే తేదీని విడుదలకు ఎంచుకున్నాయి. ఈ ఏడాది జూలై 30న వరుణ్ తేజ్ గని
సినిమా విడుదల కాబోతున్నట్టు ముందుగా ప్రకటన వచ్చింది.

అదే రోజును రాధేశ్యామ్
టీమ్ కూడా విడుదల తేదీగా ఫిక్స్ చేసుకుంది. తెలుగుతోపాటు పలు ఇతర భాషల్లో రాధేశ్యామ్
సినిమా జూలై 30న విడుదల కాబోతోంది. ఇతర భాషల్లో సినిమాల విడుదల తేదీలను కూడా పరిగణనలోకి తీసుకుని రాధేశ్యామ్
ఆ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. దీంతో గని
చిత్ర యూనిట్ పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఆ తేదీని వదులుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. రాధేశ్యామ్
తో పాటు పలు భారీ సినిమాలు ఆ నెలలో విడుదలవుతున్నందున సెప్టెంబర్‌కు విడుదలను వాయిదా వేయాలని గని
యూనిట్ అనుకుంటోందట. ప్రస్తుతం విడుదల తేదీ విషయంలో గని
టీమ్ మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది.