బాడీగార్డును పెళ్లి చేసుకున్న స్టార్‌ నటి..

0
204
Spread the love

‘బేవాచ్‌’ సీరియల్‌ ద్వారా కుర్రకారును వెర్రెక్కించిన హాలీవుడ్‌ నటి పమేలా ఆండర్సన్ లాక్‌డౌన్‌లో తన బాడీగార్డును పెళ్లి చేసుకున్నారు‌.

ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. గతేడాది ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత జాన్‌ పీటర్స్‌ను పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొద్ది రోజులకే అతడికి దూరంగా ఉంటున్నట్లు ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఒంటరిగా ఉంటున్న ఆమె లాక్‌డౌన్‌లో తన బాడీగార్డు డాన్‌ హేహర్ట్స్‌ను కెనడాలోని తన వ్యాన్‌కౌవేర్‌ ఐలాండ్‌లో వివాహం చేసుకున్నట్లు చెప్పారు

ఆమెకు ఇది ఆరోవ వివాహం. గతేడాది రహస్య వివాహం చేసుకున్న పమేలా అండర్సన్‌(53) వెడ్డింగ్‌ ఫ్రాక్‌లో తన భర్త డాన్‌‌తో కలిసి ఉన్న పెళ్లి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ తమ వివాహన్ని అధికారికంగా ప్రకటించారు

అంతేగాక తాను సోషల్‌ మీడియాకు కూడా దూరంగా ఉండాలనుకుంటున్నానని, ఇందుకోసం తన ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ ఖాతాలను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.కరోనావైరస్ లాక్‌డౌన్‌ సమయంలో నేను డాన్‌ హేహర్డ్స్‌తో ప్రేమలో పడ్డాను. దీంతో అతడిని వివాహం చేసుకున్నాను

నిజంగా నన్ను ప్రేమించే వ్యక్తి చేతిలో ఇప్పుడు నేను సురక్షితంగా ఉన్నానని ఖచ్చితంగా చెప్పగలను. అతడితో కలిసి ఉన్న ఈ ఒక్క ఏడాది నాకు ఏడు జన్మల బంధంగా అనిపిస్తోంది’ అంటూ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రాసుకొచ్చారు.

కాగా పమేలా, డాన్‌ను తమ చర్చి పాస్టర్స్‌‌, కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో క్రిస్టియన్‌ సంప్రాదాయంలో గతేడాది పెళ్లి చేసుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

కాగా జనవరి 2020లో ప్రముఖ నిర్మాత జాన్‌ పిటర్స్‌ను అయిదవ వివాహం చేసుకున్న పమేలా 12 రోజులకే అతడికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించి అందిరిని షాక్‌కు‌ గురిచేశారు.

ఈ నేపథ్యంలో సరిగ్గా ఏడాది తర్వాత తన బాడిగార్డును వివాహం చేసుకున్నట్లు ప్రకటించి మరోసారి షాక్‌ ఇచ్చారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here