మణిశర్మపై చిరు అసంతృప్తి!.. నిజమేనా?

0
194
Spread the love

తెరపై కనిపించేవారే కాదు.. తెరవెనుక ఉండే వారి కాంబినేషన్‌ కూడా కరెక్ట్‌గా సెట్‌ అయితేనే.. ఆ సినిమాకి పరిపూర్ణత వస్తుంది. సినిమా కూడా తిరుగులేని విజయం సాధిస్తుంది. అలాంటి కాంబినేషన్‌ గురించి చెప్పుకోవాలంటే.. ఖచ్చితంగా చిరు-మణిశర్మ కాంబినేషన్‌ గురించే చెప్పుకోవాలి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ దాదాపు సక్సెస్‌ తీరం చేరాయి. ‘బావగారూ బాగున్నారా’ చిత్రం నుంచి మొదలైన వీరి కాంబినేషన్‌.. ‘చూడాలని ఉంది’, ‘అన్నయ్య’, ‘ఇంద్ర’, ‘ఠాగూర్‌’, ‘స్టాలిన్‌’.. ఇలా దాదాపు 10కి పైగా చిత్రాల వరకు కొనసాగింది. అప్పట్లో చిరు-మణిశర్మ కాంబినేషన్‌ అంటే పక్కా హిట్‌.. రాసుపెట్టికోండి అనేలా పేరు పడింది. కాకపోతే.. ఆ తర్వాత వీరిద్దరి మధ్య వచ్చిన కొన్ని మిస్‌ అండర్‌స్టాండింగ్స్‌ కారణంగా చిరు.. మణిశర్మని దూరం పెట్టేశాడు.

మళ్లీ వీరిద్దరి మధ్య ఉన్న మిస్ అండర్‌స్టాండింగ్స్‌ దూరమవడం.. చిరు బర్త్‌డే కోసం మణిశర్మ ప్రత్యేకంగా పాటలు కంపోజ్‌ చేయడం వెరసీ.. కొరటాలతో చిరు చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆచార్య’ కు మ్యూజిక్‌ కంపోజ్‌ చేసే అవకాశం మణిశర్మను వరించింది. యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ దేవిశ్రీ, థమన్‌లు ఒకవైపు ఇండస్ట్రీని షేక్‌ చేస్తుంటే.. టాప్‌ మ్యూజిక్‌ దర్శకుడైన మణిశర్మ మాత్రం ఆ స్పీడ్‌ని అందుకోలేకపోయాడు. తిరిగి తన సత్తా చాటేందుకు ప్రయత్నాలు మొదలెట్టిన మణిశర్మకు మంచి ఊపునిచ్చిన చిత్రం మాత్రం ‘ఇస్మార్ట్ శంకర్‌’ చిత్రమే. ఈ చిత్రం తర్వాత అంటే 2021లో చిన్న, పెద్ద కలిపి మణిశర్మ దాదాపు 12 చిత్రాలకు మ్యూజిక్‌ కంపోజ్‌ చేస్తున్నారు. అందులో మెగాస్టార్‌ ‘ఆచార్య’ చిత్రం కూడా ఒకటి.

వాస్తవానికి ‘ఆచార్య’ చిత్రానికి ముందు మ్యూజిక్‌ ఇచ్చేది ఆస్కార్‌ విజేత ఏ.ఆర్‌. రెహమాన్‌ అనుకున్నారు. ఆ తర్వాత కూడా బాలీవుడ్‌కి చెందిన ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకుల పేర్లు వినిపించాయి. కానీ చివరికి మణిశర్మే మ్యూజిక్‌ డైరెక్టర్‌ అంటూ.. కొరటాల ప్రకటించారు. ఈ కాంబినేషన్‌ గురించి కూడా కొరటాల చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ‘ఆచార్య’ మ్యూజిక్‌ విషయంలో చిరు అసంతృప్తిగా ఉన్నాడనేలా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వచ్చిన ‘ఆచార్య’ ట్రైలర్‌ మ్యూజిక్‌ విషయంలో కూడా చిరు అసంతృప్తిని ప్రదర్శించాడనేలా వార్తలు వినిపిస్తున్నాయి. ముందు రెడీ అయిన ట్రైలర్‌కి మ్యూజిక్‌ నచ్చకపోవడంతో.. మళ్లీ చిరు మ్యూజిక్‌ మార్పించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ‘ఆచార్య’ తర్వాత చిరు-బాబీల కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. చిరు-మణిశర్మకి ఉన్న క్రేజ్‌ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ మణిశర్మనే అనుకున్నారని, కానీ ‘ఆచార్య’ విషయంలో చిరు ప్రదర్శించిన అసంతృప్తి కారణంగా.. ఇప్పుడా సినిమాకు మణిశర్మ ప్లేస్‌లో మరో మ్యూజిక్‌ డైరెక్టర్‌ని అనుకుంటున్నట్లుగా టాక్‌ నడుస్తోంది. మరి ఇండస్ట్రీలో విపరీతంగా స్ర్పెడ్‌ అవుతున్న ఈ వార్తలపై ఇరు చిత్రవర్గాలు ఎలా రెస్పాండ్‌ అవుతాయో చూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here