మా సినిమాకు మంచి డేట్‌ను బుక్‌ చేసేసుకుంటున్నాం

0
213
Spread the love

ఈ మూడు చిత్రాల రిలీజ్‌ డేట్స్‌ బుధవారం అధికారికంగా ప్రకటించారు. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్లు’. హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ చిన్‌ ఈ సినిమాను డైరెక్ట్‌ చేశారు. నటుడు, మంచు విష్ణు తండ్రి మోహన్‌బాబు పుట్టినరోజు మార్చి 19. తండ్రి బర్త్‌డే స్పెషల్‌గా ఈ సినిమాను మార్చి 19న విడుదల చేయనున్నారు విష్ణు. అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’.

Mosagallu and Most Eligible Bachelor movie release date fix

బన్నీ వాసు, దర్శకుడు వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్‌ 19న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉండగా, ‘‘మేం మా సినిమాకు ఓ మంచి డేట్‌ను బుక్‌ చేసేసుకుంటున్నాం. టైటిల్, ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయకముందే అక్టోబర్‌ 1న సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం’’ అని ప్రకటించాయి – జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు. గోపీచంద్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో ఈ సంస్థలు ఓ సినిమా నిర్మించనున్నాయి. ఈ సినిమా ఇంకా షూటింగ్‌ సెట్‌కి వెళ్లకముందే రిలీజ్‌ డేట్‌ సెట్‌ చేయడం విశేషం. మార్చి నెలలో షూటింగ్‌ ప్రారంభం కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here