మెగాస్టార్‌ని ఫాలో అవుతున్న ఎన్టీఆర్ ..!

0
202
Spread the love

సీనియర్ హీరోలని జూనియర్ హీరోలు ఫాలో అవుతుండటం..కొన్ని విషయాలలో ఇన్స్పిరేషన్‌గా తీసుకోవడం చూస్తూనే ఉంటాము. సీనియర్ హీరోలు చేసిన సినిమాలని…వాళ్ళ లైఫ్ స్టైల్‌ని చూస్తూ తమ లైఫ్ స్టైల్‌ని డిజైన్ చేసుకుంటుంటారు. ఇకా లెజెండ్ యాక్టర్ మెగాస్టార్‌ని దేశ వ్యాప్తంగా ఫాలో అవని వారి ఎవరుంటారు చెప్పండి. బయట అభిమానులే కాదు సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న యంగ్ హీరోలు కూడా ఆయనని అభిమానిస్తూ చాలా విషయాలలో ఫాలో అవుతున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో యంగ్ టైఫర్ ఎన్టీఆర్ కూడా మెగాస్టార్‌ని ఒక రియాలిటీ షో విషయంలో ఫాలో అవుతున్నాడట.

రీసెంట్‌గా ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ రియాలిటీ షో హోస్ట్ గా వ్యవహరించేందుకు ఒప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ రియాలిటీ షో ప్రోమోతో వచ్చి అభిమానులకి, ప్రేక్షకులని భారీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు ఎన్టీఆర్. నార్త్ ప్రేక్షలతో పాటు సౌత్ ప్రేక్షకుల్లోనూ ఈ రియాలిటీ షో మీద విపరీతమైన ఆసక్తి.. క్రేజ్ ఉంది. దాదాపు 120 దేశాలకు పైగా ఈ రియాలిటీ షోను విజయవంతంగా కొనసాగిస్తుండటం ఎంతో గొప్ప విషయం. ఇప్పటికే హిందీలో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ పేరుతో హిందీలో పన్నెండు సీజన్లు పూర్తి చేసుకోగా బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ రియాలిటీ షోకి హోస్ట్‌గా వ్యవహరించారు.

తెలుగులోనూ ఈ రియాలిటీ షో నాలుగు సీజన్లని పూర్తి చేసుకుంది. ఇక ఐదవ సీజన్ త్వరలో ప్రారంభం కాబోతోంది. కాగా ఈ రియాలిటీ షో్‌కి ఎన్టీఆర్ భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నారు. మొదటి మూడు సీజన్స్ కి నాగార్జున అందుకున్న రెమ్యూనరేషన్ కంటే నాలుగవ సీజన్‌కి మెగాస్టార్ అందుకున్న రెమ్యూనరేషన్ దాదాపు డబుల్ అని చెప్పుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరికంటే ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ భారీగా అందుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒకరకంగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి రెమ్యూనరేషన్ పరంగా ఎన్టీఆర్.. మెగాస్టార్‌ని ఫాలో అయ్యాడనే అంటున్నారు. అయితే ఇది కేవలం బయట జరుగుతున్న ప్రచారం మాత్రమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here