రకుల్ కెరీర్ మళ్ళీ డైలమా..?

0
188
Spread the love

హీరోయిన్స్‌కి క్రేజ్ ఎప్పుడు ఎలా పెరుతుందో ఎప్పుడు తగ్గుతుందో ఏ ఒక్కరు అంచనా వేయలేరు. స్టార్ హీరోయిన్‌గా వరసగా సినిమాలు చేస్తున్న వాళ్ళ ఒక్కసారిగా కెరీర్ తలకిందులైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ లిస్ట్‌లో రకుల్ ప్రీత్ సింగ్ చేరిందా.. అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో ‘కెరటం’ అన్న సినిమాతో పరిచయమైన రకుల్ ప్రీత్ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరసగా స్టార్స్‌తో నటించే అవకాశాలు అందుకొని మోస్ట్ వానెటెడ్ హీరోయిన్‌గా మారింది. అయితే ఎంత త్వరగా స్టార్ హీరోయిన్‌గా పాపులారిటీని దక్కించుకుందో అంతే త్వరగా క్రేజ్‌ని కోల్పోయింది. రాం చరణ్‌తో చేసిన ‘ధృవ’ సినిమా తరువాత మళ్ళీ రకుల్‌కి హిట్ అన్నది దక్కలేదు.

నాగార్జునతో నటించిన ‘మన్మధుడు 2’ సినిమాకి నెటిజన్స్ నుంచి ట్రోల్స్ వచ్చాయి. ఇక రకుల్ ప్రీత్ సింగ్ సినిమా కెరీర్ దాదాపుగా క్లోజ్ అయినట్టే అన్న మాట వినిపిస్తున్న సమయంలో మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలని ఒప్పుకొని షాకిచ్చింది. ఇదే సమయమలో బాలీవుడ్ సినిమాలకి సైన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే నితిన్‌తో నటించిన ‘చెక్’ సినిమా మళ్ళీ రకుల్ కెరీర్‌ని డైలమాలో పడేసింది. ఈ సినిమా మీద రకుల్ చాలా నమ్మకాలు పెట్టుకుంది. ఒకవేళ ‘చెక్’ సినిమా సూపర్ హిట్ అయి ఉంటే రకుల్ జోరు ఇప్పుడు వేరేలా ఉండేది. కానీ అన్నీ తారుమారయ్యాయి. ప్రస్తుతం తెలుగులో క్రిష్ – వైష్ణవ్ తేజ్‌ల సినిమా ఒక్కటే చేతిలో ఉంది. ఈ సినిమా గనక హిట్ అయితే రకుల్ మళ్ళీ ఫాంలోకి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. చూడాలి మరి రకుల్‌కి క్రిష్ హిట్ ఇస్తాడా లేదా. ఇక బాలీవుడ్ సినిమాలు చేస్తున్న రకుల్ అక్కడ మాత్రం బాగానే జోరు చూపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here