యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు ప్రభాస్ వాలంటైన్ డే గిఫ్ట్ ఇవ్వనున్నాడు. తన కొత్త సినిమా రాధేశ్యామ్
కు సంబంధించిన ప్రత్యేక వీడియోను విడుదల చేయబోతున్నాడు. ఈ నెల 14న ఉదయం 9 గంటల 18 నిమిషాలకు గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్
పేరుతో ప్రత్యేక వీడియోను విడుదల చేయనున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ఈ విషయం తెలియజేస్తూ చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

జేబులో చేతులు పెట్టుకొని స్టైల్‌గా నడుస్తున్న ప్రభాస్ పోస్టర్ బయటకు వచ్చింది. ఈ పోస్టర్ చాలా కూల్‌గా, ఆకట్టుకునే విధంగా ఉంది. జిల్
రాధాకృష్ణ రూపొందిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. రాధే శ్యామ్
హిందీ వెర్షన్‌కు మిథున్, మనన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తుండగా.. దక్షిణాది భాషలకు సంగీతం సమకూర్చే బాధ్యతను జస్టిన్ ప్రభాకరన్‌కు అప్పగించారు. ఈ నెల 14న గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్
తో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తారేమో చూడాలి.