‘వైల్డ్‌డాగ్‌’ వచ్చేస్తున్నాడు…రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్‌

0
373
Spread the love

కింగ్, అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్‌’. ఇది మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రమిది. అహిషోర్ సాల్మ‌న్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్‌ 2న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. నాగార్జున జోడీగా దియా మీర్జా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో స‌యామీ ఖేర్ క‌నిపించ‌నున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

సినిమా హైదరాబాద్‌ సహా హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మ‌నాలీలో ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంది. య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజ‌య్ వ‌ర్మ‌గా నాగార్జున ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని విభిన్న త‌ర‌హా యాక్షన్ రోల్ చేస్తున్నారు. క్రిమిన‌ల్స్‌ను నిర్దాక్షిణంగా డీల్ చేసే విధానం వ‌ల్ల సినిమాలో ఆయ‌న‌ను ‘వైల్డ్ డాగ్’ అని పిలుస్తుంటారు. కిర‌ణ్ కుమార్ సంభాష‌ణ‌లు రాస్తుండ‌గా, షానీల్ డియో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here