పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు నిర్మాత అధికారికంగా ప్రకటించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మొఘల్ చక్రవర్తి జౌరంగజేబు కాలానికి చెందిన కథాంశంతో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం గండిపేట ప్రాంతాన్ని, భారీ చార్మినార్ సెట్‌ను చిత్ర యూనిట్ నిర్మించింది. ప్రస్తుతం ఈ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. నిధి అగర్వాల్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ పేద ప్రజలకు అండగా నిలబడే బందిపోటు పాత్రలో కనిపిస్తాడు. జౌరంగజేబు పాత్రలో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు. ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతి పోటీలో సూపర్‌స్టార్ మహేశ్ ‘సర్కారువారి పాట’ సినిమా కూడా ఉంది.
