`సర్కారు వారి పాట`లు ఆగస్టులో..?

0
171
Spread the love

సంగీత దర్శకుడు తమన్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. అల వైకుంఠపురములో.. ఇచ్చిన జోష్‌తో కెరీర్‌లో అత్యుత్తమ దశకు చేరాడు. ప్రస్తుతం అగ్ర హీరోలందరి సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకు కూడా తమనే సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల దుబాయ్ వెళ్లి మహేష్‌‌ను కలిసి వచ్చాడు. ఈ పాటల గురించి మహేష్ అభిమానులు తమన్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా పాటల గురించి ఏదైనా అప్‌డేట్ ఇవ్వమని ఇటీవల ఓ అభిమాని ట్విటర్ ద్వారా తమన్‌ను అడిగాడు. దీనికి స్పందించిన తమన్.. సినిమా విడుదలకు చాలా సమయం ఉంది. ఈ సినిమా పాటలు అద్భుతంగా ఉండబోతున్నాయి. అది మాత్రం ఫిక్స్‌. ఆగస్టులో కలుద్దాం అని రిప్లై ఇచ్చాడు. దీంతో సర్కారు వారి పాట తొలి సింగిల్ మహేష్ బర్త్ డే సందర్భంగా ఆగస్టులో విడుదల కాబోతోందని అభిమానులు చర్చించుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here