సర్కారు వారి పాట దుబాయ్ వెళ్ళడం లేదా..?

0
289
Spread the love

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. వరస హిట్స్‌తో మంచి ఫాంలో ఉన్న మహేష్ కెరీర్‌లో తెరకెక్కుతున్న 27వ సినిమాకి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే దుబాయ్‌లో నెల రోజుల భారీ షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం ఆ తర్వాత గోవాలో అలాగే మళ్ళీ దుబాయ్‌లో షూటింగ్ ప్లాన్ చేశారని వార్తలు వచ్చాయి. దుబాయ్‌లోనే మరో నెల రోజుల షెడ్యూల్ కంప్లీట్ చేయాలని సన్నాహాలు చేసినప్పటికి కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా పెరుగుతుండటంతో సర్కారు వారి పాట బృందం దుబాయ్ షెడ్యూల్ క్యాన్సిల్ చేసినట్టు తాజా సమాచారం.

అయితే ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో 25రోజుల షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలో పక్కాగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక కుంభకోణం నేపథ్యంలో కథ సాగుతుందట. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here