‘సలార్’ కాంబోతో దిల్ రాజు..?

0
215
Spread the love

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో సినిమా చేయాలంటే ఇప్పుడు పెద్ద నిర్మాణ సంస్థలు క్యూ కడుతున్నాయి. బాహుబలి సినిమా తర్వాత నుంచి ప్రభాస్ మీడియం బడ్జెట్ సినిమాలు చేయడం లేదు. ప్రభాస్‌తో సినిమా అంటే కనీసం ఓ మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ కేటాయించాల్సిందే. ఇప్పటికే రాధే శ్యామ్ సినిమాని కంప్లీట్ చేసిన ప్రభాస్ ప్రస్తుతం సలార్ అన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో పాటు బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ఆదిపురుష్ 3డి లోనూ రాముడిగా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ సమాంతరంగా సాగుతున్నాయి. జూలై 30న రాధే శ్యామ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. రాధకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది.

ఇక ఆదిపురుష్ సినిమాకి బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా కృతి సనన్ ప్రభాస్‌కి జంటగా సీత పాత్రలో కనిపించబోతోంది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ లాంటి క్రేజీ స్టార్స్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.అలాగే సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా కేజీఎఫ్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సలార్ సినిమా మీద భారీ అంచనాలుండగా ఇదే కాంబినేషన్‌లో మరో ప్రాజెక్ట్‌ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు లేటెస్ట్ న్యూస్. గతంలో దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్ మున్నా, మిస్టర్ పర్‌ఫెక్ట్ అన్న సినిమాలు చేశాడు. మరి ఈ హ్యాట్రిక్ సినిమాకి సంబంధించిన అధికారక ప్రకటన ఎప్పుడు వెలువడనుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here