తన ఫొటోపై వ్యంగ్యంగా కామెంట్ చేసిన ఓ నెటిజన్‌కు బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ఘాటు రిప్లై ఇచ్చింది. అతను సారీ
చెప్పినా అనసూయ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇటీవల లంగా వోణీలో దిగిన ఫొటోను అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫొటోలోని అనసూయ స్టిల్‌పై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. నువ్వేమైనా
అఆసినిమాలో సమంత అనుకుంటున్నావా?
అని ఓ మీమ్ క్రియేట్ చేశాడు.

దీనికి స్పందించిన అనసూయ అయ్యయ్యో.. లేదమ్మా.. నన్ను అనసూయ అంటార
ని రిప్లై ఇచ్చింది. దాంతో సదరు నెటిజన్.. సారీ మేడమ్.. ఏదో సరదాగా (కిడ్డింగ్)చేశాను.. లైట్‌గా తీసుకోండ
ని రిప్లై ఇచ్చాడు. దానికి మళ్లీ అనసూయ స్పందిస్తూ.. అవును.. నువ్వు మానసికంగా చిన్న పిల్లవాడివే(కిడ్)నని అర్థమైంది. నువ్వు త్వరగా ఎదగాలని కోరుకుంటున్నా
అంటూ రిప్లై ఇచ్చింది. దీనిని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.