2020లో ప్రత్యేక ముద్ర వేసిన 25 మంది యువ డైనమిక్ వ్యక్తులను జిక్యూ ఇండియా ప్రకటించింది. ఈ లిస్ట్‌లో విభిన్న రంగాలకు చెందిన వారిని వెలికితీసింది. 2020 సంవత్సరం ప్రతి ఒక్కరూ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో తెలియంది కాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా కొందరి పేరు ప్రత్యేకంగా వినబడింది. అటువంటి వారినే జిక్యూ ఇండియా ప్రకటించి, సత్కరించింది. ఈ లిస్ట్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించి టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్థానం సంపాదించారు. అల్లు అర్జున్‌తో పాటు అనుష్క శర్మ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ రంగం నుంచి స్థానం పొందింది. 2020లో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు పెద్ద హిట్ అవడమే కాకుండా.. దేశ, విదేశాలకు వ్యాపించి తెలుగు సినిమా సత్తాను చాటాయి. అందుకే 2020లో అల్లు అర్జున్‌ని జిక్యూ ఇండియా మోస్ట్ ఇన్‌ఫ్లూయన్స్ యంగ్ ఇండియన్స్ లిస్ట్‌లో స్థానం కల్పించి, గౌరవించింది.

జిక్యూ ఇండియా ప్రకటించిన 25 మోస్ట్ ఇన్‌ఫ్లూయన్స్ యంగ్ ఇండియన్స్ లిస్ట్ ఇదే
- జెహన్ దరువల
- అభిషేక్ ముంజల్
- డా. నందినీ వెల్‌హో
- బైజు రవీంద్రన్
- అనుష్క శర్మ మరియు కర్నేష్ శర్మ
- ప్రణవ్ పై మరియు సిద్ధార్థ్ పై
- తరుణ్ మోహతా మరియు స్వప్నిల్ మెహతా
- లీజా మంగళ్‌దాస్
- డానిష్ సైత్
- బాల సర్దా
- కె.ఎల్. రాహుల్
- కునాల్ షా
- మాధవ్ షెత్
- డా. త్రినేత్ర హల్‌దార్ గుమ్మరాజు
- చైతన్య తమ్హనే
- అల్లు అర్జున్
- అక్షయ్ నెహతా
- వరుణ్ దేశ్‌పాండే
- అనంద్ విర్మణి, అపరాజితా నినన్
- క్రిషి ఫగ్వానీ
- అపర్ణ పురోహిత్
- మినమ్ అపాంగ్
23 అంబి మరియు బిందు సుబ్రమణియమ్
- డా. సూరజ్ యంగ్డే
- రిషభ్ పంత్