0
183
Spread the love

‘ఇస్మార్ట్ శంక‌ర్’ తో సూపర్‌ హిట్‌ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్న ఎనర్జిటిక్‌ హీరో రామ్‌.. ఆ వెంటనే ‘రెడ్‌’ అంటూ ద్విపాత్రాభినయంతో విభిన్న తరహా చిత్రం చేసి.. ఏ జానర్‌ అయినా రెడీ అన్నట్లుగా సిగ్నల్‌ పంపాడు. ఆ చిత్రం తర్వాత ఆయన హీరోగా.. ఆవారా, పందెంకోడి వంటి సూప‌ర్ సక్సెస్‌ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ఎన్‌. లింగుసామి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో శ్రీ‌నివాసా చిట్టూరి నిర్మాత‌గా ఓ ఊర మాస్ చిత్రం తెర‌కెక్కుతోంది. గురువారం ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్మాణ సంస్థ కార్యాల‌యంలో జరిగాయి.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. ”చాలా కాలంగా హీరో రామ్‌తో సినిమా చేయాల‌ని మంచి స‌బ్జెక్ట్ కోసం చూస్తున్నాం. లింగుసామిగారు చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ స‌బ్జెక్ట్ మా అంద‌రికీ న‌చ్చి రామ్‌గారికి వినిపించాం. క‌థ విన‌గానే ఆయ‌న కూడా చాలా ఎగ్జైట్ అయ్యి వెంట‌నే సినిమా చేద్దామ‌ని అన్నారు. ఈ మూవీ రామ్‌, లింగుసామి కాంబినేష‌న్‌లో ఒక ఊర‌మాస్ సినిమాగా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. మా బ్యాన‌ర్‌లో భారీ బ‌డ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రెస్టీజియ‌స్‌గా రూపొందిస్తున్నాం. త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తాం’’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here