Facebook Loans, గోల్డెన్‌ ఛాన్స్ స్టార్ట‌ప్ ల‌కే!

0
59
Spread the love

చిరు వ్యాపారులు, స్టార్టప్‌లకు అండగా నిలిచేందుకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు Facebook ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. ఆగస్టు 20 నుంచి ఈ లోన్లు ఇస్తామని ఫేస్‌బుక్‌ ఇండియా ప్రకటించింది.

స్టార్టప్‌లు చిరు వ్యాపారులకు అండగా నిలిచేందుకు స్మాల్‌ బిజినెస్‌ లోన్‌ పేరుతో గతేడాది 100 మిలియన్‌ డాలర్లతో ప్రత్యేక నిధిని ఫేస్‌బుక్‌ ఏర్పాటు చేసింది. వీటితో 30 దేశాల్లోని మైక్రో, మీడియం బిజినెస్‌లో ఉన్న సంస్థలకు సాయం చేయాలని నిర్ణయించింది.

ఇండియాఫై ద్వారా స్మాల్‌ బిజినెల్‌ లోన్‌ పథకం అమలు చేసేందుకు ఇండిఫై సంస్థతో ఫేస్‌బుక్‌ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం ఇండిఫై సంస్థ చిరు వ్యాపారులకు లోన్లు అందించే సంస్థగా పని చేస్తోంది. ఫేస్‌బుక్‌ స్మాల్‌బిజినెస్‌ లోన్లు పొందాలనుకునేవారు ఇండియాఫై ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

భార‌త్ లో ఉన్న 200 పట్టణాల్లోని చిరు, మధ్యతరహా వ్యాపారులకు లోన్లు ఇవ్వనున్నారు. కనిష్టంగా రూ. 5 నుంచి గరిష్టంగా రూ.50 లక్షల వరకు లోన్లు ఇస్తారు. తొలివిడతగా ఆగస్టు 20వ తేది నుంచి ఈ పథకాన్ని హైదరాబాద్‌, న్యూఢిల్లీ, గురుగ్రామ్‌, ముంబై, బెంగళూరులలో అమలు చేయనున్నారు. కనీసం మూడు వేల మందికి అయినా లోన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్మాల్‌బిజినెస్‌ ద్వారా ఇచ్చే లోన్‌కి నామమాత్రపు వడ్డీ తీసుకుంటారు. ఇక మహిళా వ్యాపారులకయితే అతి తక్కువగా 0.20 శాతం వడ్డీకే రుణాలు ఇస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here