బాలీవుడ్ నటుడు రణవీర్ పై ఎఫ్ఐఆర్..?

0
43
Spread the love

బాలీవుడ్ యంగ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh) సినిమాల మాట ఎలా ఉన్నా తన డ్రెస్సింగ్‌ స్టైల్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. ఇప్పటికే అతను వేసుకున్న డ్రెస్‌లపై నెటిజన్లు ఘోరమైన కామెంట్లు మీమ్స్ చేశారు. ‘దీపికా నువ్‌ అయినా నీ భర్తకు చెప్పొచ్చుగా’ అంటూ ట్రోల్ కూడా చేశారు. ఇక తాజాగా రణ్‌వీర్‌ సింగ్ చేసిన న్యూడ్ ఫొటో షూట్‌ పెద్ద దుమారమే రేపుతోంది. మీమర్స్‌ అయితే మీమ్స్‌తో ఫన్నీగా, సీరియస్‌గా విరుచుకుపడుతున్నారు. పలువురు సెలబ్రిటీలు పొగడ్తుంటే నెటిజన్లు, ప్రేక్షకులు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు.ఇక తాజాగా రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటో షూట్‌పై, సామాజిక కార్యకర్తలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే రణ్‌వీర్ సింగ్‌ ఒక మానసిక రోగి అంటూ బ్యానర్లు కూడా కట్టారు. నూలు పోగు కూడా లేకుండా ఉన్న రణ్‌వీర్ సింగ్‌ను చూసిన వారు కొందరు, దుస్తులు సేకరించి మరీ అతనికి పంపారు. ఈ విధమైన పరిస్థితులు చూస్తుంటే ఈ వివాదం ఇంకా కొనసాగేలా ఉందని తెలుస్తోంది. కాగా అసలు ఈ ఫొటోస్ దిగడానికి గల కారణం, పేపర్‌ మ్యాగజైన్‌ కోసం. 1972లో కాస్మొపాలిటన్‌ మ్యాగజైన్ కోసం “ఐకాన్‌ బర్ట్‌ రెనాల్డ్స్‌” కు నివాళిగా ఈ ఫొటోషూట్‌ చేశారు.

ఇక ఈ ఫోటోని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అయింది. దీనిని కొంతమంది సమర్థిస్తుంటే..మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ముంబైలో రణ్‌వీర్‌పై కేసులు కూడా నమోదయ్యాయి

అయితే ప్రస్తుతం ఈ విషయంపై స్పందించిన ముంబై పోలీసులు ‘రణవీర్ సింగ్’ తన న్యూడ్ ఫోటోషూట్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు
తన ఛాయాచిత్రాల ద్వారా మహిళల మనోభావాలను దెబ్బతీశారని, వారి మనస్స్సును కించపరిచారని చెంబూరు పోలీస్ స్టేషన్‌కు అందిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు బాలీవుడ్ నటుడిపై కేసు నమోదు చేశారు. సింగ్ ఒక మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసాడు, అక్కడ అతను నగ్నంగా పోజులిచ్చాడు, అంటూ ది హిందూ నివేదించింది.

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, లైక్ చేస్తూ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా “ఐరా మీడియా” ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేస్తూ, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కు ఈ వీడియో ను షేర్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here