Homeఆరోగ్యంరక్తపోటు, మధుమేహ బాధితులకు గుడ్‌న్యూస్‌..! భారీగా తగ్గనున్న మందుల ధరలు..!

రక్తపోటు, మధుమేహ బాధితులకు గుడ్‌న్యూస్‌..! భారీగా తగ్గనున్న మందుల ధరలు..!

మారుతూ వస్తున్న జీవనశైలితో పాటు వాతావరణ కాలుష్యం నేపథ్యంలో దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతున్నాయి. రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు జనాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మార్కెట్‌ మందులు, చికిత్సకు భారీగా ఖర్చవుతున్నది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కేంద్రం ఉపశమనం కల్పించింది. ప్రభుత్వం నిర్ణయంతో మధుమేహం, గుండె జబ్బులు, జ్వరం, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే మందుల ధరలు తగ్గాయి.

కేంద్ర ప్రభుత్వం 39 ఫార్ములేషన్ల ధరలను నిర్ణయించింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) నోటిఫికేషన్‌లో ఔషధాల బ్లాక్ మార్కెటింగ్ నిరోధించడానికి 39 ఫార్ములాల ధరలను నిర్ణయించింది. ఇందులో మధుమేహం, నొప్పి నివారణలు, జ్వరం, గుండె మరియు కీళ్ల నొప్పులకు సంబంధించిన మందులు సైతం ఉన్నాయి. వీటితో పాటు 4 స్పెషల్ ఫీచర్ ప్రొడక్ట్స్‌ ధరల సవరింపునకు కూడా ఆమోదం తెలిపింది. రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఇచ్చిన అధికారాలను ఉపయోగించి.. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) మందుల రిటైల్ ధరను నిర్ణయిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, వీటికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. యాక్టిహీల్-డీ, అడియల్ ప్లస్, అల్ట్రిబ్ డీ, బయోరిల్-డీఆర్‌బీ, బీటీఆర్ డీ, చైమోప్రా డీ, చైమోథాల్ ప్లస్, కోవిటెంజ్ డీ, డెబ్రిలైజ్ ప్లస్, డెంజైమ్, అడెనెస్ డీ ఉన్నాయి. ఇకపై మందులన్నీ చౌకగా మారడంతో సామాన్యులకు ఊరట కలిగినట్లయ్యింది.

RELATED ARTICLES

Most Popular