Homeఅంతర్జాతీయంయువత బంగారు భవిష్యత్తు కోసమే జగన్ కృషి

యువత బంగారు భవిష్యత్తు కోసమే జగన్ కృషి

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా నేత. మరీ ముఖ్యంగా ఆయన నిత్యం యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే ఉంటారు. రాష్ట్రంలోని యువతను, నిరుపేద పిల్లలను దృష్టిలో పెట్టుకుని విద్యారంగంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌(ys jagan) వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టారు, చేపడుతున్నారు. ఆయన అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు దీర్ఘకాలంలో ఫలితాలు ఇచ్చి, కుటుంబాలు పైకి ఎదగడానికి దోహదం చేస్తాయి.

ప్రజలకు భవిష్యత్తులో ఫలితాలు ఇవ్వాలని ఆయన కష్టపడుతున్నారు. అయితే.. దాన్ని అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా బురద చల్లుతున్నాయి. పాలిటెక్నిక్‌(polytechnic) విద్యను ప్రోత్సహించడం, ఆ విద్యను అందుకోవడానికి విద్యార్థులకు తగిన సౌకర్యాలను కల్పించడం ఆయన చేస్తున్న మరో గొప్ప పని.

యువత బంగారు భవిష్యత్తుకు పాలిటెక్నిక్‌ విద్య మంచి మార్గమని రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్‌ చదలవాడ నాగరాణి అనడంలో అర్థం అదే. స్వతంత్రం వచ్చేనాటికి దేశం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. పారిశ్రామికంగా కూడా దేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రథమ ప్రధాని జవహరల్‌లాల్‌ నెహ్రూ ఎంతో ముందు చూపుతో ఐఐటి, పాలిటెక్నిక్‌, ఐటీఐలను ప్రవేశపెట్టారు. ఐఐటి నుంచి బయటకు వచ్చే యువత వినూత్నమైన ఆలోచనలు చేసి ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తుంది. వాటిని పాలిటెక్నిక్‌ చదివిన యువత క్షేత్రస్థాయిలో ఆచరణలోకి తెస్తుంది. ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నైపుణ్యం సాధించిన శ్రామిక శక్తిని ఐటిఐలు అందిస్తాయి. ఇదీ కాన్సెప్ట్‌. ఇందుకు అనుగుణంగా ఏయే స్థాయి విద్యార్థులు ఆయా స్థాయిలో నైపుణ్యాలు సాధించి ఉపాధి పొందడానికి వీలుగా జగన్‌ విద్యరంగంపై తన పూర్తి శ్రద్ధ పెడుతున్నారు.

ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం ఏప్రిల్‌ 27న ప్రవేశపరీక్ష జరగనుంది. పాలిటెక్నిక్‌ విద్యపై చైతన్యం కలిగించడానికి సాంకేతిక విద్య, శిక్షణ మండలి బుక్‌లెట్లను, పోస్టర్లను నాగరాణి విడుదల చేశారు. పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్‌ విద్యలో అడ్మిషన్లు పొందడానికి అవకాశం ఉంటుంది. పాలిటెక్నిక్‌ విద్య వల్ల కలిగే ప్రయోజనాలపై, ఉద్యోగ అవ‌కాశాల‌పై, లభించే వేతనాలపై అవగాహన కల్పించే చర్యలకు పూనుకున్నారు.

పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు రాష్ట్రంలో 87 ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశ పరీక్షకు సంబంధించి శిక్షణ ఇస్తారు. తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ఈ కోచింగ్‌ ఉంటుంది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలను ఆధునీకరించి.. చాలా వసతి సౌకర్యాలను కల్పించారు. విద్యార్థులకు పాలిటెక్నిక్‌ విద్య అనేది ఓ మంచి అవకాశం. ప్రైవేట్‌ సంస్థలకు కూడా అటువంటి వర్క్‌ ఫోర్స్‌ అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకుని పాలిటెక్నిక్‌ విద్యను జగన్‌ ప్రభుత్వం మెరుగ్గా అందించడానికి చర్యలు తీసుకుంది.

RELATED ARTICLES

Most Popular