జాబ్ క్యాలెండ‌ర్ ఒక జాదూ క్యాలెండ‌ర్ … కొత్త క్యాలండ‌ర్ ఇవ్వ‌క‌పోతే 19న సీఎం ఇల్లు ముట్ట‌డి

0
116
Spread the love

వాలంటీర్ల‌ను జాబ్ క్యాలండ‌ర్‌లో చేర్చ‌టం త‌గ‌దు
నిరుద్యోగుల‌ను మోసం చేసిన జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు బుద్ధి చెప్తారు
అన్ని శాఖ‌ల్లోని ఉద్యోగ ఖాళీల‌ను భ‌ర్తీ చేయాలి
అర్ధ న‌గ్న‌, భిక్షాట‌న కార్య‌క్ర‌మంలో టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్

రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల విడుద‌ల చేసిన జాబ్ క్యాలెండ‌ర్‌కు వ్య‌తిరేకంగా, విద్యార్థులు, నిరుద్యోగులు భ‌విష్య‌త్‌ను విస్మ‌రించిన జ‌గ‌న్ రెడ్డి విధానాల‌ను నిర‌సిస్తూ మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం టీఎన్ఎస్ఎఫ్ విభాగం అధ్వ‌ర్యంలో స్థానిక బ‌స్టాండ్ వ‌ద్ద విద్యార్థులు, నిరుద్యోగులు అర్ధ న‌గ్న‌, భిక్షాట‌న కార్యక్ర‌మాన్ని నిర్వ‌హించారు.
ఈ సంద‌ర్భంగా విద్యార్థులు, నిరుద్యోగులు బ‌స్టాండ్ సెంట‌ర్‌లో వాహ‌నాల‌ను శుభ్రం చేస్తూ భిక్షాట‌న చేసారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాయ‌మాట‌లతో నిరుద్యోగుల‌ను న‌మ్మించి అధికారంలోకి వ‌చ్చారు. జ‌గ‌న్ రెడ్డి విడుద‌ల చేసిన జాబ్ క్యాలెండ‌ర్‌ ఒక జాదూ క్యాలండ‌ర్ అని టీఎన్ఎస్ఎఫ్ నాయ‌కులు విమ‌ర్శించారు.

కార్య‌క్ర‌మంలో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం టీఎన్ఎస్ఎఫ్ అధ్య‌క్షులు రాయ‌పూడి కిర‌ణ్ కామెంట్స్ః
జ‌గ‌న్ రెడ్డి ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు పాద‌యాత్ర‌లో 2,30,000 ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని మాయ మాట‌లు చెప్పారు.
కానీ ఇప్పుడు కేవ‌లం 10,143 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులు పొట్ట‌కొట్టారు.
నిరుద్యోగుల‌ను న‌మ్మించి మోసం చేసిన జ‌గ‌న్ రెడ్డికి బుద్ధి చెప్పే వ‌ర‌కు పోరాడ‌తాం.
వాలంటీరు ఉద్యోగాలు కేవ‌లం ప్ర‌జా సేవ కోసం ఏర్పాటు చేసామ‌ని సాక్షాత్తు ముఖ్య‌మంత్రి చెప్పారు.
వాలంటీర్ల‌కు కూడా చాలీచాల‌ని జీతాలు ఇచ్చి, ఆ ఉద్యోగాల‌ను ఇచ్చిన‌ట్లు జాబ్ క్యాలండ‌ర్‌లో చేర్చ‌టం దుర్మార్గ‌మైన చ‌ర్య‌. ఇది త‌గ‌దు.
పోలీసు, విద్య‌, వైద్య‌, ఆర్ధిక ప‌లు శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న 45,000 ఉద్యోగాల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాలి.
లేని ప‌క్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్ధి సంఘాల‌ను క‌లుపుకొని ఉద్య‌మాన్ని తీవ్ర‌తరం చేస్తాం.
ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అల‌వాటు మారిన రివ‌ర్స్ టెండ‌రింగ్ లా జాబ్ క్యాలెండ‌ర్‌ను మ‌ర‌ల విడుద‌ల చేయాలి.

కొత్త జాబ్ క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేయ‌క‌పోతే జూలై 19న అఖిల ప‌క్ష విద్యార్ధి యువ‌జ‌న సంఘాల‌ను క‌లుపుకొని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యాన్ని ముట్ట‌డిస్తాం.

నిర‌స‌న‌లో ప‌లువురు టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువ‌త నాయ‌కులు మాట్లాడుతూ యువ‌త‌ను, నిరుద్యోగుల‌ను మోసం చేసిన జ‌గ‌న్ రెడ్డికి ప్ర‌జ‌లు బుద్ధి చెప్తార‌ని అన్నారు.

కార్య‌క్ర‌మంలో మంగ‌ళ‌గిరి మండ‌లం టీఎన్ఎస్ఎఫ్ అధ్య‌క్షులు కాండ్రు రాజేష్‌, దుగ్గిరాల మండ‌లం టీఎన్ఎస్ఎఫ్ అధ్య‌క్షులు గండు కోటి యాద‌వ్‌, తెలుగు యువ‌త నాయ‌కులు పాలేటి రాజ్‌కుమార్‌, దాస‌రి సునీల్‌, టీఎన్ఎస్ఎఫ్ నాయ‌కులు వ‌ల్లూరు వంశీ, వెంక‌ట్‌, యాకోబు, జి. ప్ర‌భుకుమార్‌, షేక్ భాషా, బెజ‌వాడ గోపి, షేక్ కాంశీ, గండు భాను ప్ర‌కాష్‌, న‌ల్ల‌గొర్ల సుధాక‌ర్‌, డీకొల్లు చైత‌న్య, త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here