ఉద‌యం న‌డిస్తే (Morning Walk) వ‌చ్చే లాభాలు (Benefits) ఇవే!

0
26
Spread the love

అన్ని వ్యాయామాల కన్నా నడక ఎంతో ఉత్తమమైనది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయిదే ఉదయం పూట నడక మంచిదా? సాయంకాలం నడక మంచిదా అనే విషయంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ప్రతి మనిషి జీవితంలో వ్యాయామం తప్పనిసరి. ఆధునిక యుగంలో అన్ని పనులు యాంత్రీకరణ జరగడంతో మనిషికి శారీరక శ్రమ లేకుండా పోయింది. అందుకే ప్రతి ఒక్కరు రోజులో కనీసం అరగంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అయితే ఉదయం పూట నడక మంచిదా, లేదంటే సాయంత్రం నడక మంచిదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

ఉదయం వచ్చే సూర్య కాంతిలో నడవడం వల్ల శరీరంలో మెలిటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. మెలిటోనిన్ హార్మోన్ మనలో అలసటకు కారణం అవుతుంది. ఇది తగ్గడం వల్ల రోజంతా ఉషారుగా ఉంటారు. ఇది మేల్కొని ఉన్నామనే అనుభూతిని కలిగిస్తుంది. ఉదయపు సహజ కాంతికి మానవ శరీరం సహజంగానే స్పందిస్తుంది.ఉదయం కళ్లు తెరవగానే మెదడుకు సంకేతాలు వెళతాయి. హైపోథాలమస్ సంకేతాలు స్వీకరిస్తుంది. ఇది మన శరీర జీవ గడియారం లాంటిది. ఉదయపు సూర్యకాంతిలో నడవడం వల్ల జీవ గడియం వేగవంతం అవుతుంది.

మనలో కొందరు రాత్రి పూట నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి కారణం ఉదయం వాకింగ్ చేయకపోవడం అని కూడా పరిశోధనల్లో తేలింది. ఉదయం ప్రతి రోజూ కనీసం అరగంట వాకింగ్ చేస్తే రాత్రి పూట బాగా నిద్ర పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. నడక వల్ల జీవ గడియారం గాడిన పడుతుంది. ఇందుకు రాత్రి సమయం ఉపయోగపడుతుంది. ఉదయం తగినంత సమయం ఎండలో ఉండకపోవడం వల్ల కూడా రాత్రి పూట సరిగా నిద్ర పట్టకపోవడానికి కారణం కావచ్చు. ఉదయపు వెలుగు శరీరంపై పడితే సెరిటోనిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. ఇది మనస్సు స్థితిని మెరుగు పరుస్తుంది. దీని వల్ల ఉల్లాసంగా అనిపిస్తుంది.

వాకింగ్ చేయడం ఎంత ముఖ్యమో వేగంగా నడవడం కూడా అంతే. నడవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటే, వేగంగా నడవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వేగంగా నడవడం వల్ల గుండె జబ్బుల భారిన పడే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఉదయం వేగంగా నడిచే వారిలో గుండె జబ్బులు 10 నుంచి 20 శాతం తగ్గినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. సాధారణంగా నడవడం వల్ల క్యాన్సర్ భారిన పడే ప్రమాదం తప్పుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు ప్రతి ఒక్కరు రోజులో కనీసం అరగంట నడవాలి. వర్క్ ఫ్రం హోం పని చేసే వారు ఇంట్లోనే రోజుకు రెండు, మూడు దఫాలుగా నడిచినా మంచి ఫలితాలే వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here