ఎవరీ లెజెండ్..ఎందుకీ సినిమా పిచ్చి..?

0
91
Spread the love

దక్షిణాది రాష్ట్రాల్లో శరవణా స్టోర్స్ గురించి తెలియని వారుండరు. ఏది కావాలన్నా ఈ స్టోర్స్ లో దొరుకుతాయి. అందుకే తమిళనాడులో ఈ స్టోర్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఎంతో కష్టపడి ఈ స్టోర్స్ సక్సెస్ కు పాటుపడిన శరవణన్ సినిమా రంగంలోకి ప్రవేశించారు. ది లెజెండ్ పేరుతో ఓ సినిమా రిలీజ్ చేసి ఔరా అనిపిస్తున్నాడు. ఆ వివరాలు చూద్దాం…

శరవణన్…. శరవనా స్టోర్స్ అధినేతగా అందిరికీ పరిచయమే. స్టోర్స్ వ్యాపారంలో తనదైన ముద్ర వేసిన శరవణన్ అనేక యాడ్స్ లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే 51 సంవత్సరాల వయసులో హీరోగా సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే ఓ స్టోరీ ఒకే చేసి ది లెజెండ్ పేరుతో తెరకెక్కించారు. నిన్న రీలీజ్ అయిన సినిమా మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది….శరవణన్ మొదటిసారిగా సినిమాల్లో నటించారు. అందులో వయసుకు తగ్గ స్టోరీ సెలెక్ట్ చేసుకోలేకపోయారని కూడా మూవీ రివ్యూల ద్వారా తెలుస్తోంది. వయసుకు తగ్గ పాత్ర ఎంచుకుని ఉంటే బాగుడేందని సినిమా క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. శరవణన్ నటన బాగానే ఉన్నా, ఆయన హీరోగా ఎంచుకున్న పాత్ర వయసుకు తగినట్టుగా లేదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యాపారాల్లో రాణించినా సినిమాల్లో కూడా సత్తా చాటుకోవాలని శరవణన్ చేసిన మొదటి ప్రయత్నం బెడిసి కొట్టింది. అయితే శరవణన్ మొదటి ప్రయత్నంతోనే సినిమాలో నటించడం ఆపేస్తాడా, లేదంటే ఈ అనుభవంతో మరో ప్రయత్నం చేస్తాడా అనేది వేచి చూడాల్సిందే….

శరవణన్ తీసిన ది లెజెండ్ సినిమా పోతే పోయింది గాని, వారి స్టోర్స్ కు మంచి పాపులారిటీ లభించిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమాకు 40 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. సినిమా పోతే పోయింది గానీ, ది లెజెండ్ సినిమా శరవణన్ కు ఓ పాఠం నేర్పిందని చెప్పవచ్చు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here